Singer Died In Car Accident: రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ యువ సింగర్.. దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి..
Singer Died In Car Accident: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు దిల్జాన్ సింగ్ (31) కారు ప్రమాదంలో మృతి చెందారు. అమృత్‌సర్-ఢిల్లీ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో దిల్జాన్ సింగ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. జాతీయ రహదారిలో అమృత్‌సర్‌కు 20 కిలోమీటర్ల..

Singer Died In Car Accident: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు దిల్జాన్ సింగ్ (31) కారు ప్రమాదంలో మృతి చెందారు. అమృత్‌సర్-ఢిల్లీ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో దిల్జాన్ సింగ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. జాతీయ రహదారిలో అమృత్‌సర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఈ విషాధకర సంఘటన చోటుచేసుకుంది.

Singer Died In Accident
పోలీసులు వివరాల ప్రకారం.. దిల్జాన్ మహీంద్ర కేయూవీ 100 కారును స్వయంగా నడిపించుకుంటూ వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. కర్తర్‌పూర్ పట్టణం నుంచి అమృత్‌సర్ వెళ్లే సమయంలో రాత్రి 2.30 గంటలకు ట్రక్‌ను ఢీకొట్టడాని, మరో 20 కి.మీల దూరం ప్రయాణిస్తే దిల్జాన్ తన గమ్య స్థానాన్ని చేరుకునే వారని చెప్పుకొచ్చారు. ఇక ప్రమాదానికి గురైన వెంటనే దిల్జాన్‌ను స్థానికులు.. దగ్గరల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే దిల్జాన్ ఆసుపత్రికి వెళ్లే లోపే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం దిల్జాన్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దిల్జాన్ భార్య పిల్లలు కెనెడాలో నివాసం ఉంటున్నారు. యంగ్ సింగర్ మృతి పట్ల పంజాబ్ సినీ ప్రపంచంతో పాటు అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ దిల్జాన్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. దిల్జాన్ హఠాన్మరణం దిగ్ర్భాంతికి గురి చేసిందని, ఇలాంటి యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం చాలా బాధాకరమని తెలిపారు. దిల్జాన్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తూ, అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ముఖ్యమంత్రి చేసిన ట్వీట్..
Shocked at the tragic death of young and promising Punjabi singer Diljaan in a road accident earlier today. It is extremely sad to lose young lives like these on road. My condolences to the family, friends and fans. RIP! pic.twitter.com/ZLxQidrO5P
— Capt.Amarinder Singh (@capt_amarinder) March 30, 2021
Also Read: Suicide: హైదరాబాద్‌లో దారుణం.. నమ్మించి వంచించాడు.. చివరికి అవమానించి గెంటివేయడంతో..
రంగారెడ్డి జిల్లాలో విషాదం.. పెళ్లైన నాలుగు నెలలకే కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా..!
ఎటుపోతోంది ఈ సమాజం.. అటు వైద్యులు పట్టించుకోలేదు.. ఇటు ప్రజలూ పట్టించుకోలేదు.. చివరికి ఆ చిన్నారి..
