మయన్మార్ సరిహద్దుల్లో టీటీడీ తలనీలాలు కలకలం.. పట్టుబడిన జుట్టుపై వివరణ ఇచ్చిన అధికారులు
రెడ్‌సాండిల్, గోల్డ్, డ్రగ్స్ వంటి వాటిని దేశ సరిహద్దులు దాటించే కేటుగాళ్లను చూసే ఉంటాం. జుట్టును తల వెంట్రుకలను టార్గెట్ చేస్తూ కొందరు కంత్రీగాళ్లు.
TTD clarified on Hair smuggling: రెడ్‌సాండిల్, గోల్డ్, డ్రగ్స్ వంటి వాటిని దేశ సరిహద్దులు దాటించే కేటుగాళ్లను చూసే ఉంటాం. జుట్టును తల వెంట్రుకలను టార్గెట్ చేస్తూ కొందరు కంత్రీగాళ్లు. బోర్డర్ దాటించేందుకు యత్నించి దొరికిపోయారు. ఈ జుట్టు స్మగ్లింగ్‌పై ఏకంగా టీటీడీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో పోలీసులు సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. టీటీడీ తన వద్ద ఉన్న తలనీలాలను ఈ ప్లాట్ ఫామ్ ద్వారా అంతర్జాతీయ టెండర్‌దారులకు విక్రయిస్తుందని పేర్కొంది. టెండర్ లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జీఎస్‌టీ కట్టించుకుని తలనీలాలు అప్పగించడం జరుగుతుందని వెల్లడించింది. తలనీలాలు కొనుగోలు చేసిన బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా ? లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశంలోని అనేక ఆలయాలలో తలనీలాల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే టీటీడీ కూడా ప్రతి మూడు నెలలకోసారి ఈ టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇందుకు సంబంధిత అధికారులు తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతామని టీటీడీ వెల్లడించింది.
ఇదిలావుంటే, వారం రోజుల క్రితం మయన్మార్ సరిహద్దుల్లో రూ. 2కోట్ల విలువైన తలనీలాలను అసోం రైఫిల్స్ భద్రతా దళాలు పట్టుకున్నారు. మిజోరాంలోని చంపాయ్ జిల్లా చుంగ్తె దగ్గర జుట్టును స్వాధీనం చేసుకున్నారు. వీటిని థాయ్‌లాండ్, చైనాకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న జుట్టును పట్టుకున్నామని అసోం రైఫిల్స్, కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఎలాంటి బిల్లులు గానీ, రవాణా పత్రాలు గాని లేకుండా రెండు లారీల్లో సుమారు 120 సంచుల్లో ఈ జుట్టును సరిహద్దు దాటించే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు. కేటుగాళ్లు జుట్టు పట్టుకుంటే… గుట్టు వెలుగుచూసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన జుట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ జుట్టు అక్రమ రవాణాపై టీటీడీ వివరణ ఇచ్చింది. భక్తులు సమర్పించిన తలనీలాలను అంతర్జాతీయ టెండర్లలో ఎక్కువ కోట్ చేసిన వారికి విక్రయిస్తామని తెలిపింది.
కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష టీడీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మొన్నటి దాకా జగన్ రెడ్డి బ్యాచ్ శేషాచలం నుంచి ఎర్రచందనం చైనాకు స్మగ్లింగ్ చేసింది. ఇప్పుడు తలనీలాలు కూడా స్మగ్లింగ్ చేస్తోంది. అక్రమంగా మయన్మార్ సరిహద్దు దాటుతున్న 120 సంచుల తలనీలాలను 23 సెక్టార్ అస్సాం రైఫిల్ సిబ్బంది పట్టుకున్నారు. విచారణలో అవి తిరుమల నుంచి వచ్చాయని తేలింది. ఇందుకు బాధ్యత వహిస్తూ టీటీడీ పాలకమండలి, అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
మొన్నటి దాకా జగన్ రెడ్డి బ్యాచ్ శేషాచలం నుంచి ఎర్రచందనం చైనాకు స్మగ్లింగ్ చేసేది. ఇప్పుడు తలనీలాలు కూడా స్మగ్లింగ్ చేస్తోంది. అక్రమంగా మయన్మార్ సరిహద్దు దాటుతున్న 120 సంచుల తలనీలాలను 23 సెక్టార్ అస్సాం రైఫిల్ సిబ్బంది పట్టుకున్నారు. విచారణలో అవి తిరుమల నుంచి వచ్చాయని తేలింది pic.twitter.com/FN9Bt1ohAM
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) March 30, 2021