Tirupati By Election 2021 : తిరుపతి బై పోల్ అభ్యర్థులు రత్నప్రభ, పనబాక, గురుమూర్తి, చింతా ఆస్తుల ఫుల్ డిటైల్స్

Tirupati By Election 2021 Candidates Assets  : తిరుపతి లోక్‌సభ బై ఎలక్షన్లో పోటీ చేస్తోన్న వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు..

Tirupati By Election 2021 : తిరుపతి బై పోల్ అభ్యర్థులు రత్నప్రభ, పనబాక, గురుమూర్తి, చింతా ఆస్తుల ఫుల్ డిటైల్స్
Tirupati By Poll 2021
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 30, 2021 | 6:39 PM

Tirupati By Election 2021 Candidates Assets  : తిరుపతి లోక్‌సభ బై ఎలక్షన్లో పోటీ చేస్తోన్న వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు తమ తమ ఆస్తుల వివరాలు ఎంతన్నవి లెక్కకట్టి చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ లో స్వయంగా ప్రకటించారు. ఈ లెక్కల ప్రకారం తిరుపతి లోక్‌సభ స్థానానికి బీజేపీ తరపున పోటీ పడుతున్న కత్తి రత్నప్రభ మిగతా అభ్యర్థుల కంటే బాగా రిచ్. ఆమెకున్న స్థిర, చరాస్తులు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 24.68 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ఇందులో ఆమె పేరిట ఉన్న ఆస్తులు19.57 కోట్ల రూపాయలు. ఆమె భర్త ఎ.విద్యాసాగర్‌ పేరున ఉన్న ఆస్తులు రూ.5,10,77,146 రూపాయలు. బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ చేతిలో 25వేల రూపాయల క్యాష్ ఉంది.

ఇక, బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్లు 2.81 కోట్ల రూపాయలు ఉంటే బాండ్ల రూపాయంలో 28వేలు, పోస్టల్ సేవింగ్స్ అకౌంట్‌లో 4 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇక ఆభరణాల విషయానికి వస్తే.. 52 లక్షల రూపాయల విలువైన బంగారం 1250 గ్రాముల బంగారం, 1.95 లక్షల రూపాయల విలువైన మూడు కేజీల వెండి ఉంది. 16 లక్షల రూపాయల రెండెకరాల వ్యవసాయ భూమి, 3 కోట్ల రూపాయల విలువైన నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2.43 లక్షల రూపాయల రుణం తీసుకున్నట్లు రత్నప్రభ ప్రకటించారు. రత్నప్రభ భర్త విద్యాసాగర్ పేరున కోటి రూపాయల స్థిరాస్తులు, 4.10 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి. తమపై ఎలాంటి కేసులు లేవని రత్న ప్రభ అఫిడవిట్‌లో ప్రకటించారు.

ఇలాఉంటే, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ మొత్తం ఆస్తుల విలువ రూ 7.73 కోట్ల రూపాయలు. బంగారం, స్థిరచరాస్తులు, ఇళ్లు, స్థలాలు అన్నీ కలిపి తనకున్న ఆస్తుల విలువ 7 కోట్ల 74 లక్షల రూపాయలని అఫిడవిట్‌లో తెలిపారు పనబాక.

ఇక, కాంగ్రెస్ క్యాండిటేట్ చింతామోహన్ కూడా కోటీశ్వరుడే. చింతామోహన్ పేరున ఎలాంటి ఆస్తులు లేవు. కానీ ఆయన కుటుంబ ఆస్తులు మాత్రం 3.27 కోట్ల రూపాయలు. ఈ ఆస్తి మొత్తం ఆయన భార్య పేరున ఉంది. ఇందులో 2 లక్షల రూపాయల క్యాష్, 14.40 లక్షల రూపాయల విలువైన 400 గ్రాముల బంగారం ఉంది. తిరుపతిలో 20 సెట్ల వ్యవసాయేతర భూమి ఉంది. దీని మార్కెట్ విలువ కోటి 20 లక్షల రూపాయలు. తిరుపతిలోని రామచంద్ర నగర్‌లో 95 లక్షల రూపాయల వాణిజ్య భవనం, ఎస్‌బీఐలో 19.11 లక్షల రూపాయల అప్పుందని చింతామోహన్ ప్రకటించారు. వార్షిక ఆదాయం 6.10 లక్షల రూపాయలని తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్‌లో తెలిపారాయన.

మిగతా అభ్యర్థులతో పోలిస్తే.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆస్తులు కాస్త తక్కువే. ఆయన మొత్తం ఆస్తుల విలువ 47.25 లక్షల రూపాయలు. గురుమూర్తి పేరిట .10.66 లక్షల రూపాయల స్థిర చరాస్తులు ఉన్నాయి. గురుమూర్తి భార్య నవ్య పేరిట 24.92 లక్షల రూపాయల ఆస్తులున్నాయి. ఆమెకు కారు 7 లక్షల రూపాయల విలువైన కారు కూడా ఉంది. ఏర్పేడు మండలం మన్న సముద్రం గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 2.610 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు ఉందని గురుమూర్తి ప్రకటించారు. దాని ప్రస్తుత మార్కెట్ విలువ ఐదు లక్షలుగా చూపించారు. గురుమూర్తిపై ఆధారపడిన కార్తికేయ నిక్స్షల్ దగ్గర రూ.2.92 లక్షల విలువైన 62 గ్రాముల బంగారం, డెలిన నిక్స్షల్ దగ్గర రూ.3.73లక్షల 83 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. తనకు అప్పులు, తనపై క్రిమినల్ కేసులు లేవని ప్రకటించారు వైసీపీ అభ్యర్థి.

ఇక, సీపీఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరి స్థిర చరాస్తుల విలువ 50వేల రూపాయలు మాత్రమే. ఆయన దగ్గర చేతిలో ఉన్న క్యాష్ వెయ్యి రూపాయలు మాత్రమే. ఎస్బీలో 3895 రూపాయలు ఉన్నాయి. భార్యకు రెండు గ్రాముల తాళిబొట్టు ఉందని.. దాని విలువ 8వేల రూపాయలుగా అఫిడవిట్‌లో ప్రకటించారు. 216 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటి విలువ 50వేల రూపాయలుగా ప్రకటించారు. యాదగిరి మీద ఎలాంటి కేసులు లేవు.

Read also : US Navy sing Hindi song : అమెరికా నేవీ హిందీ పాట ఆలపించిన అరుదైన సంఘటన, వైరల్ అవుతోన్న వీడియో