పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిపై రైతుల దాడి.. కారు ధ్వంసం

పంజాబ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశ్వని శర్మపై రైతులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారును ధ్వంసం కాగా, ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిపై రైతుల దాడి.. కారు ధ్వంసం
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 12, 2020 | 10:16 PM

పంజాబ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశ్వని శర్మపై రైతులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారును ధ్వంసం కాగా, ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా హోషియార్‌పూర్ జిల్లాలోని తాండా ప్రాంతంలో సోమవారం రైతుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ ప్రాంతానికి కారులో వచ్చిన అశ్వని శర్మను గమనించిన ఆందోళన చేస్తున్న కొందరు రైతులు దాడి చేశారు. ఆయన కారుపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. స్థానిక పోలీసులు సకాలంలో స్పందించి జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. అశ్వని కుమార్‌ను పోలీసులు భద్రత మధ్య సమీప పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఈ దాడిని వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో పలుచోట్ల రాస్తారోకో చేపట్టారు. రాజకీయపార్టీల కుట్రలో భాగంగానే అశ్వని శర్మపై దాడి జరిగిందని బీజేపీనేతలు ఆరోపించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతులు గత నెల నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు.