మహిళల భద్రతకు ‘షెర్ని స్క్వాడ్’ బృందాలు

ఈవ్‌టీజర్లతో పాటు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆగడాలకు చెక్‌పెట్టేందుకు యూపీ సర్కార్ కొత్త ఫ్లాన్ చేసింది.

మహిళల భద్రతకు 'షెర్ని స్క్వాడ్' బృందాలు
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 12, 2020 | 10:57 PM

ఈవ్‌టీజర్లతో పాటు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆగడాలకు చెక్‌పెట్టేందుకు యూపీ సర్కార్ కొత్త ఫ్లాన్ చేసింది. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘షెర్ని స్క్వాడ్’ బృందాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఈవ్-టీజింగ్, వేధింపుల సమస్యపై పోరాడటానికి, ఉత్తర ప్రదేశ్ పోలీసులు ‘షెర్ని స్క్వాడ్’ బృందాన్ని ఏర్పాటు చేశారు. యాంటీ రోమియో స్క్వాడ్ తరువాత, రాష్ట్రంలోని మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలను కట్టేందుకు షెర్ని స్క్వాడ్ కృషీ చేయనుంది.

మహిళ‌ల‌పై హింస‌కు సంబంధించి అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అగ్ర స్థానంలో ఉందని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కలు చెబుతున్నాయి. దీంతో మహిళ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని యోగి సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈవ్-టీజింగ్ ప్రభావిత ప్రాంతాల షాపింగ్ మాల్స్, మార్కెట్లు, మతపరమైన ప్రదేశాల వంటి బహిరంగ ప్రదేశాలలో ఈ బృందంలోని సభ్యులను మోహరిస్తారు. ఈ బృందం ప్రతి ఉదయం 10 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు బహిరంగ ప్రదేశాలపై నిఘా పెడతారు.

ఈ బృందంలో పాల్గొనే అధికారులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమం కూడా జరిగింది. ఇతరులను రక్షించేటప్పుడు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాలటించాలని అధికారులు సూచిస్తున్నారు. తమ రక్షణతో పాటు ఇతరులను భద్రతగా ఉండాలని వివరించారు. ఐపిసిలోని నిబంధనల గురించి వివరించిన అధికారులు.. ఈ టీమ్ కు ప్రత్యేకించి శారీరక శిక్షణ కూడా అందించారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో సామూహిక అత్యాచారం, హత్య తర్వాత భారీగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి భయానక సంఘటనలు పునరావృతంగా కాకుండా ఉండేందుకే యోగి సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.