కృష్ణా జిల్లాలో యాక్షన్ సీన్… రెండు గ్రామాల మధ్య పబ్ జీ ఫైట్.. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు

ఆడుకుందాం అనుకున్నారు..ఫ్రెండ్స్‌ అంతా కలిసి ఒకచోట చేరారు..ఇంకేముంది గేమ్‌ స్టార్ట్‌ అయ్యింది..ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది..ఏమైందో తెలియదు ఒక్కసారిగా వారి మధ్య గొడవ మొదలైంది..

  • Ram Naramaneni
  • Publish Date - 11:44 am, Wed, 3 March 21
కృష్ణా జిల్లాలో యాక్షన్ సీన్... రెండు గ్రామాల మధ్య పబ్ జీ ఫైట్.. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు
రెండు గ్రామాల మధ్య పబ్ జీ ఫైట్

ఆడుకుందాం అనుకున్నారు..ఫ్రెండ్స్‌ అంతా కలిసి ఒకచోట చేరారు..ఇంకేముంది గేమ్‌ స్టార్ట్‌ అయ్యింది..ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది..ఏమైందో తెలియదు ఒక్కసారిగా వారి మధ్య గొడవ మొదలైంది..అక్కడితో ఆగిందా.. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలివానలా మారి రెండు గ్రామల మధ్య గొడవకు దారితీసింది. ఈ ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. విద్యార్థులందరూ నూజివీడులోని ఒకే కాలేజీలో చదువుతున్నారు.. ఈ మధ్య పబ్‌జీ బ్యాన్‌ అయినా.. అలాంటి ఎన్నో గేమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాంటి గేమే.. అంతా కలిసి ‌ ఆడుతున్నారు. గొడవ గేమ్‌లో మొదలైందా..? గేమ్‌ను అడ్డుపెట్టుకుని గొడవ మొదలైందో కాని.. విద్యార్థులు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. వారిని మందలించాల్సింది పోయి గ్రామస్తులు కూడా సపోర్టింగ్‌కు దిగారు. ఎవరి గ్రామానికి చెందిన విద్యార్థులను ఆ గ్రామాలు వెనకేసుకు రావడమే కాకుండా.. కొట్లాటలో పాల్గొన్నాయి.

మొత్తం మీద ఈ గొడవ రెండు గ్రామల కొట్లాటకు దారి తీసింది. నూజివీడు మండలం కొత్తూరు తండా – సిద్ధార్ధ్‌నగర్ గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నూజివీడు రూరల్ ఎస్‌ఐ రంజిత్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.

ఆడుకునేందుకు వయసుతో పన్లేదు. ఆటలంటే ఉల్లాసం కలిగించాలి. ఉత్సాహం నింపాలి. గెలిచినా, ఓడినా స్పోర్టివ్‌ స్పిరిట్‌తో తీసుకోవాలి. పుస్తకాల్లో దొరకని ఎన్నో విషయాలను ఆటల్లో నేర్చుకుంటారు విద్యార్థులు. అలాంటిది.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం గొడవ వరకు వెళ్లారు..స్నేహితులతో ఆడుకోవాలి కాని వాటి కోసం స్నేహితులనే కొట్టకూడదు..మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి ఆటలవుతాయి కానీ.. గొడవలకు దారి తీసేవి ఆన్‌లైన్‌ గేమ్స్‌ కావు.

ఇక ఆన్‌లైన్‌ గేమ్స్‌పై స్పందించింది కేంద్రం..కొన్ని మొబైల్ గేమ్స్ హింసాత్మకంగా ఉండటంతో పాటు, యూజర్లను వ్యసనపరులుగా మార్చుతున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. పబ్జీ గేమ్ ఆ కోవకు చెందినదేనని వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి, విలువలను ప్రోత్సహించేలా గేమింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాని కింద వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, యానిమేషన్‌కు సంబంధించి కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు.

ఐఐటీ ముంబయి సహకారంతో కేంద్ర సమాచార, ప్రసార శాఖ గేమింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2021లో కొత్త సెషన్‌ ప్రారంభంతో దీన్ని అమల్లోకి తీసుకు వస్తామన్నారు..చిన్నారులు, యువతలో వాటి గురించి అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొబైల్స్‌, ఇతర గాడ్జెట్లలో అందుబాటులో ఉన్న చాలా గేమ్స్ హింసాత్మకంగా ఉంటున్నాయి. యూజర్లను వ్యవసపరులుగా మారుస్తున్నాయి. ఇవి చిన్నారుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పబ్జీ వాటిలో ఒకటి. అయితే వాటిని విమర్శించి ప్రయోజనం లేదు. మేక్‌ఇన్‌ఇండియా కింద మన సొంత గేమ్స్‌, యాప్స్‌ను తయారుచేసుకోవాలి’ అని జావడేకర్ వెల్లడించారు.

Also Read:

ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు

పాలసీలు చేయిస్తారు.. ప్రాణాలు తీసేస్తారు.. కరడుగట్టిన హంతకులు.. సంచలన నిజాలు