దూబే పోస్ట్‌మార్టం రిపోర్ట్: అధికంగా రక్తస్రావం.. షాక్‌తోనే మృతి
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడు గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్త స్రావం కావడంతో పాటు షాక్‌కు గురై మరణించాడని..

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడు గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్త స్రావం కావడంతో పాటు షాక్‌కు గురై మరణించాడని పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. శనివారం ఈ ఘటనకు సంబంధించి తిరిగి సీన్ రీక్రియేట్ చేశారు. జులై 10న ఉజ్జయిని నుంచి పోలీసులు దూబేను కాన్పూర్‌కి తీసుకువెళ్తుండగా.. మధ్యదారిలో ఆ వాహనం బోల్తా పడింది. ఆ క్రమంలో దూబే తప్పించుకుని పారిపోబోతూ పోలీసులపై కాల్పులు జరపడం, వారి ఎదురుకాల్పుల్లో ఆ కిల్లర్ గాయపడి మరణించడం తెలిసిందే.
కాగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో సీనియర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు ఇక్కడ తిరిగి సీన్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ఆ రోజున అక్కడే ఉన్న పలువురు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది కూడా అక్కడ హాజరయ్యారు. తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు.
పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం.. మూడు బుల్లెట్లు దూబే శరీరంలోకి దూసుకెళ్లాయి. అలాగే వికాస్ దూబే శరీరంపై పది గాయాలయ్యాయి. మొదటి బుల్లెట్ దూబే కుడి భుజానికి, ఇంకా రెండు బుల్లెట్లు ఛాతీ ఎడమవైపు చొచ్చుకు వెళ్లాయని నివేదికలో వెల్లడించింది. అలాగే గ్యాంగ్ స్టర్ దూబే దల, మోచేయి, కడుపు భాగంలోనూ గాయాలున్నట్టు నివేదిక పేర్కొంది.
Read More:
డిశ్చార్జ్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..
బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు



