కరోనా బాధితులు డిశ్చార్జ్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే?

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత కోవిడ్ బాధితులు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలా ఉండాలి? అనే దానిపై వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సాధారణంగా లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చినవారు 10 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. అదే లక్షణాలు ఉన్నవారైతే..

కరోనా బాధితులు డిశ్చార్జ్ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే?
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2020 | 3:27 PM

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత కోవిడ్ బాధితులు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలా ఉండాలి? అనే దానిపై వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సాధారణంగా లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చినవారు 10 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. అదే లక్షణాలు ఉన్నవారైతే డిశ్చార్జ్ కావడానికి మరికొంత సమయం పడుతుంది. అయితే డిశ్చార్జ్ అయిన వారిలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించినా.. పెద్ద ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో కరోనా బాధితులు డిశ్చార్జ్ అయిన వారు ఎలా ఉండాలో కూడా వివరిస్తున్నారు.

– ఇంటికెళ్లాక అనారోగ్యంగా అనిపించినా, ఆక్సిజన్ శాతం తగ్గినా, కరోనా లక్షణాలు కనిపించినా డిశ్చార్జి కార్డులో రాసిన ఫోన్ నెంబర్లను సంప్రదించాలి. – కోవిడ్ నుంచి కోలుకున్న రోగులు అవసరమైనప్పుడు ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వారిలో వైరస్‌తో పోరాడే యాంటీబాడీలు తయారవుతాయి. – ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక రోగి ఖచ్చితంగా 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇంట్లో ఉన్నా కూడా అవసరమైన సమయంలో మాస్క్ ధరించాలి. జనావాసాల్లో తిరగకూడదు. – డిశ్చార్జ్ అయిన వ్యక్తి హోం క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఎవ్వరినీ ఇంటికి ఆహ్వానించకూడదు. – ఇంట్లో గర్భిణిలు, పిల్లలు, వయసు మీద పడ్డ వారు ఉంటే తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. – ఇక డిశ్చార్జ్ అయిన వారు సపరేటుగా ఒక గదిలో ఉండాలి. ఈ వ్యక్తికి సపరేటుగా బాత్రూమ్ ఉండాలి. నాలుగు గంటలకోసారి రూమ్ మొత్తం శానిటైజ్ చేయాలి. కరోనా సోకిన వ్యక్తి వస్తువులను నేరుగా తాకరాదు.

Read More: 

బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు

మరో మంత్రికి కరోనా పాజిటివ్..