ఖాకీ డ్రెస్సు వేసుకున్నాడు.. కటకటాల్లోకి వెళ్ళాడు..! నకిలీ ఎస్సై ఆటకట్టించిన పోలీసులు..

తలపై టోపీ.. ఒంటిపై ఖాకీ డ్రెస్సు.. నడుముకు బెల్టు..! టిప్‌టాప్‌గా ఓ రేంజ్‌లో ఉన్నాడండీ.. రోడ్డుపై వెళ్తుంటే అందరూ అతనిని సలాం చేస్తున్నారు. ఆ బిల్డప్‌ అంతలా ఉంటుంది మరి. మరి అతనెవరు..?!

ఖాకీ డ్రెస్సు వేసుకున్నాడు.. కటకటాల్లోకి వెళ్ళాడు..! నకిలీ ఎస్సై ఆటకట్టించిన పోలీసులు..
Nakili Si

తలపై టోపీ.. ఒంటిపై ఖాకీ డ్రెస్సు.. నడుముకు బెల్టు..! టిప్‌టాప్‌గా ఓ రేంజ్‌లో ఉన్నాడండీ.. రోడ్డుపై వెళ్తుంటే అందరూ అతనిని సలాం చేస్తున్నారు. ఆ బిల్డప్‌ అంతలా ఉంటుంది మరి. మరి అతనెవరు..?! ఓ ఎస్సై.. కాదు కాదు ఎస్సై అట..! కట్‌ చేస్తే.. ఇప్పుడా ఎస్సై కటకటాల్లోకి వెళ్ళాడు. ఎందుకంటారా..!?

పేరు పూడి మహేష్‌. ఊరు.. విశాఖ జిల్లా చీడికాడ మండలం వీరభద్రపేట. డిగ్రీ వరకు చదివాడు. ఇక.. పోలీస్‌ పై మక్కువతో ఎస్సైలా అవతారమెత్తాడు. ఓ ఖాకీ డ్రెస్సును సంపాదించి.. తలపై టోపీ, నడుముకు మూడు సింహాల బెల్ట్‌తో టిప్‌టాప్‌గా తయారయ్యాడు. ఇక అక్కడనుంచి బైక్‌పై తిరగడం ప్రారంభించాడు. దీంతో.. చూసిన వారంతా అతనికి ఎస్సై అనుకుని సలాం చేయడం ప్రారంభించారు. దీంతో.. ఇదేదో బాగుంది అనుకుని.. తమ దాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఎస్సైనని చెప్పి తన సొంత పనులు చేయించుకోవడం మొదలుపెట్టాడు. గత కొంతకాలంగా ఈ నకిలీ ఎస్సైగాని యవ్వారం సాగిపోతోంది.

అయితే.. అనకాపల్లిలో పోలీసులు రోజువారీలో భాగంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఎంఎస్‌రావ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద అటువైపు గా వస్తున్న వాహనాలను ఆపి వెరిఫై చేస్తున్నారు. ఇంతలో రింగురోడ్డువైపు నుంచి ఖాకీ డ్రెస్సులో ఓ వ్యక్తి ఎస్సైలా తయారై హెల్మెట్‌ పెట్టుకుని వస్తున్నాడు. అక్కడవరకు బాగానే వస్తూ.. ఒక్కసారిగా ఈ పోలీసులను చూసే సరికి వెనక్కి తిరిగి వెల్లిపోయే ప్రయత్నం చేశాడు.

అయితే.. అనుమానం వచ్చి అతనిని ఆపి ప్రశ్నించారు. దీంతో.. తాను ఎస్సైనని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఐడీ కార్డ్‌ కూడా చూపించాడు. ఓ దశలో నిజంగానే ఎస్సైఅని నమ్మిన అనకాపల్లి పోలీసులు.. ఎక్కడో అతని మాటల్లో తేడా కొట్టడంతో డౌటొచ్చింది. దీంతో.. వెరిఫై చేసేసరికి ఆ పేరుతో ఎవరూ ఎస్సైలు లేరని ప్రాథమికంగా తేలింది. దీంతో.. మహేష్‌ను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్ళారు. అక్కడ వెరిఫై తమదైన స్టైల్లో విచారించే సరికి ఈ ఎస్సై నకిలీగాడని తేలింది.

ఇంకా మహేష్‌ యవ్వారాలపై కూలీలాగారు. దీంతో.. ఈ మధ్య కాలంలోనే కొన్ని ప్రభుత్వకార్యాలయాలకు వెళ్ళి పనులు చేయించుకున్నట్టు తేలింది. తాజాగా అనకాపల్లి ఆర్టీఏ కార్యాలయంలోనూ దరఖాస్తు చేసుకుని తన పని తొందరగా చేయాలని హుకుం కూడా జారీ చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. నకిలీ ఎస్సై మహేష్‌పై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కునెట్టారు.

పాపం..! ఎన్నాళ్ళబట్టి నకీలీ ఎస్సైగా బిల్డప్ ఇస్తున్నాడో గానీ.. చివరకు ఇదిగో ఇలా అసలు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. పోలీస్‌ యూనిఫాంపై సరదా ఉండొచ్చుగానీ.. దాన్ని వేసుకుని యవ్వరాలు నడిపితే ఎలా..!

ఇవి కూడా చదవండి: Taliban Panjshir: 450 మంది తాలిబన్లు హతం.. మరోసారి పంజా విసిరిన పంజ్‌షేర్‌..

Click on your DTH Provider to Add TV9 Telugu