పోర్న్ చూసేవారికి హెచ్చరిక.. మీరు మాస్టర్ స్కెచ్‌లో చిక్కుకుంటున్నారు.. వెన్నులో వణుకు పుట్టే నిజాలు
పోర్న్‌సైట్స్ చూస్తున్నారా..? ఇకపై జాగ్రత్త..! ఎందుకంటే అలాంటి వారినే టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు..! Yes..పాప్‌అప్ లింక్స్, పోలీసుల లోగోలతో ట్రాప్ చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు స్కెచ్ వేస్తున్నారు. పోలీసు లోగోలతో పాప్‌అప్ లింక్స్ పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పోర్న్‌సైట్ చూస్తున్నారని బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. దేశ, విదేశాల పోలీసు లోగోలతో పాప్‌అప్స్ క్రియేట్ చేసి…ఈ మెయిల్, ఫేస్‌బుక్, మెసేంజర్‌లతో లింక్స్ పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేసిన వారిని టార్గెట్ చేసి పోర్న్‌సైట్స్‌తో ట్రాప్ చేస్తున్నారు. సిస్టమ్ బ్లాక్ చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. దేశవ్యాప్తంగా ఇలాంటి సైబర్ కేసులు పెరగడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. కరోనా వేవ్‌లో పోర్న్‌సైట్ చూసేవారి సంఖ్య పెరిగిపోయింది. అటు ఆన్‌లైన్ గేమ్స్ ఇంట్రస్టింగ్‌గా ఆడే సంఖ్య కూడా పెరిగింది. ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. కొత్త వైరస్ డెవలప్ చేశారు. పోర్న్‌సైట్, ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారికి పాప్‌అప్ లింక్స్ పంపిస్తున్నారు. ఇందుకోసం వివిధ దేశాల పోలీస్ లోగోలతో వైరస్‌లు క్రియేట్ చేస్తున్నారు. సోషల్‌మీడియా, మెయిల్స్ ద్వారా లింక్ పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేసిన వారికి పోర్న్‌సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. వెంటనే ఆయా కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్స్‌లోకి వైరస్ ఎంటర్ అవుతోంది. ఆ తర్వాత వారిని టార్గెట్ చేసి మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్ హ్యాక్ చేస్తున్నారు.
పోర్న్‌సైట్స్ చూస్తున్నారని, బ్యాన్ చేసిన గేమ్స్ ఆడుతున్నారని మెయిల్, మెసేజ్ చేస్తున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి పాల్పడుతున్నందుకు కంప్యూటర్లు బ్లాక్ చేస్తామని బెదిరిస్తున్నారు. మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేశామని చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న వీడియోస్, టెక్నికల్ డేటా సాయంతో ఎక్కడున్న అరెస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కేసుల నుంచి తప్పుకోవాలంటే అడిగినంత క్యాష్ ఇచ్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌కు చెందిన మహేశ్‌కి గత నెల ఆన్‌లైన్‌లో పాప్‌ఆప్ లింక్ వచ్చింది. మీరు పోర్న్‌సైట్స్ చూస్తున్నారు కంప్యూటర్‌ను బ్లాక్ చేస్తున్నామని చెప్పారు. ముంబైలో కేసు రిజిస్టర్ అయ్యిందని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. కేసులు అరెస్ట్ లేకుండా ఉండాలంటే పోర్న్ చూసినందుకు ఫైన్ కట్టాలని చెప్పి రూ.1.5లక్షలు వసూలు చేశారు. అదే విధంగా సికింద్రాబాద్‌కి చెందిన సందీప్ ఓ ఐటీ కంపనీలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌లో వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసే సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై ఓ రాష్ట్రానికి చెందిన పోలీస్ లోగోతో పాప్‌అప్ లింక్ వచ్చింది. క్లిక్ చేసిన వెంటనే వైరస్ అటాక్ అయినట్లు గుర్తించాడు. క్లిక్ చేసిన లింక్స్‌ను సిస్టమ్ నుంచి రిమూవ్ చేశాడు. ఎంప్లాయిస్‌ను అలర్ట్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేశాడు.
పరువుపోతుందనే భయంతో ఇలాంటి సైబర్ నేరాలకు గురైన బాధితుల్లో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. వేధింపులు భరించలేని కొద్ది మంది మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు రిజిస్టర్ అయ్యాయి. పాప్‌అప్స్ ,పోర్న్‌లింక్స్‌తో బ్లాక్‌మెయిలింగ్ పెరిగిపోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరైనా బ్లాక్ మెయిలింగ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
Also Read: Andhra Pradesh: ఆస్పత్రి నుంచి గంటగంటకీ ఓ సెల్ఫీ.. ఏపీ వైద్యశాఖలో ప్రకంపనలు రేపుతోన్న ఆదేశాలు