Online Loan Apps Scams ఆన్‌లైన్ లోన్ యాప్స్ మోసాలపై దర్యాప్తు ముమ్మరం.. మరో కీలక నిందితురాలు అరెస్టు
Online Loan Apps Scams: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆన్‌లైన్ యాప్స్..
Online Loan Apps Scams: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా రుణాలు ఇస్తూ బాధితులను తీవ్రంగా వేధిస్తున్నారు. దీంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు యాప్ నిర్వాహకులు వేధింపులు అధికం కావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే యాప్స్ నిర్వాహకులను అరెస్టు చేయగా, తాజాగా ఈ కేసులో సీసీఎస్ పోలీసులు పురోగతి సాధించారు.
ఈ కేసులో మరో కీలక నిందితురాలు కీర్తిని బెంగళూరులో అరెస్టు చేశారు. ఆమెను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కరోనా పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా, ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన యాప్ సూత్రధారి ల్యాంబోతో కలిసి మూడు రాష్ట్రాల్లో లోన్ యాప్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇండోనేషియాలో ఓ మహిళ సహకారంతో లోన్‌యాప్ నిర్వహణ కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: ED Focus on Loan App Scams : లోన్ యాప్ మోసాలపై ఈడీ స్పెషల్ ఫోకస్.. కూపీ లాగుతున్న అధికారులు..