AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్‌ అధినేత్రి అల్లుడిని నీడలా వెంటాడుతున్న పాత కేసులు.. రాబర్ట్‌ వాద్రాను విచారించిన ఆదాయపుపన్నుశాఖ

సోనియా అల్లుడిపై కేసులేమీ బలహీనపడలేదు. మధ్య మధ్యలో కాస్త గ్యాప్‌ వస్తోందంతే. రాబర్ట్‌వాద్రాపై ఆదాయపు పన్నుశాఖ మరోసారి కన్నేసింది. బినామీ ఆస్తుల వ్యవహారంలో రాబర్ట్‌వాద్రాని ఇంటికెళ్లి..

కాంగ్రెస్‌ అధినేత్రి అల్లుడిని నీడలా వెంటాడుతున్న పాత కేసులు.. రాబర్ట్‌ వాద్రాను విచారించిన ఆదాయపుపన్నుశాఖ
Sanjay Kasula
|

Updated on: Jan 04, 2021 | 11:03 PM

Share

Robert Vadra : సోనియా అల్లుడిపై కేసులేమీ బలహీనపడలేదు. మధ్య మధ్యలో కాస్త గ్యాప్‌ వస్తోందంతే. రాబర్ట్‌వాద్రాపై ఆదాయపు పన్నుశాఖ మరోసారి కన్నేసింది. బినామీ ఆస్తుల వ్యవహారంలో రాబర్ట్‌వాద్రాని ఇంటికెళ్లి ఐటీ అధికారులు విచారించారు. యూకేలోని ఆయుధ వ్యాపారి సంజయ్‌ భండారి ద్వారా కొనుగోలు చేసిన లండన్‌ ఆస్తులతో ముడిపడి ఉన్న కేసులో ఆదాయపు పన్నుశాఖ విచారణ జరిపింది. లండన్‌లో కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలుపై ఐటీ ఆరాతీస్తోంది. పన్ను ఎగవేతపై ఢిల్లీలోని నివాసంలో రాబర్ట్‌ వాద్రా స్టేట్‌మెంట్‌ను ఐటీ శాఖ అధికారులు రికార్డు చేశారు.

యూకేలో మూడు ఆస్తుల కొనుగోలు కేసులో ఇప్పటికే వాద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారిస్తోంది. వీటితో పాటు ఆరు ఫ్లాట్లు కూడా వాద్రావేనని ఈడీ అనుమానిస్తోంది. 2005-2010 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది.

లండన్‌లో మొత్తం 12 బిలియన్‌పౌండ్ల ఆస్తులున్నాయనే అభియోగాలతో ఈడీ విచారణ జరుగుతోంది. పన్ను ఎగవేతపై రాబర్ట్‌వాద్రాకు ఇంతకుముందే ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు హాజరుకాకపోవడంతో ఐటీ శాఖ అధికారులే వాద్రా నివాసానికి వచ్చారు. బికనీర్, ఫరాదాబాద్ భూ కుంభకోణాలతో సహా బినామీ ఆస్తుల కేసుల్లో స్టేట్‌మెంట్ తీసుకున్నారు.

ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ద్వారా యూకేలో ఆస్తుల కొనుగోలుపై 2018లో రాబర్ట్‌వాద్రాపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో పేద ప్రజల పునరావాసం కోసం ఉద్దేశించిన భూమిని వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ సంస్థ సేకరించిందన్న ఆరోపణపై 2015లో మనీ లాండరింగ్ కేసు నమోదైంది.

రాబర్ట్ వాద్రా 69.55 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమ లావాదేవీల ద్వారా ఎలెజెన్సీ ఫిన్‌లీజ్‌కు రూ.5.15 కోట్లకు అమ్మినట్టు ఆరోపణలున్నాయి. గుర్గావ్‌ ల్యాండ్ డీల్స్‌లో వాద్రాతో పాటు.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపైనా 2018లో పోలీసు కేసు నమోదైంది. ఇన్ని కేసులు నమోదువుతున్నా, వరుసగా దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నా.. ఆరోపణలు నిరాధారమని సోనియా అల్లుడు అంటున్నారు.

Follow Us
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్