Manikonda Manhole Update: 34 గంటలు గడిచినా దొరకని ఆచూకీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
Manikonda Manhole Update: హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 34 గంటలు
Manikonda Manhole Update: హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 34 గంటలు గడిచినప్పటికీ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గోపిశెట్టి రజనీకాంత్ ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో రెస్క్యూ బృందాలు నగరంలోని గోల్డెన్ టెంపుల్ నుంచి నెక్నంపూర్ చెరువు వరకు గాలిస్తున్నాయి. రజినీకాంత్ ఆచూకీ కొరకు ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. రజనీకాంత్ మృతదేహం పైప్ లైన్ మధ్యలో ఇరుక్కుని ఉంటుందని రెస్క్యూ బృందాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాన కాలువ నుంచి నెక్నంపూర్ చెరువు వరకు నీటి ప్రవాహాన్ని పెంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. కాగా.. భారీ వర్షానికి నాలలో రాళ్లు, ఇసుక, చెత్త కొట్టుకువచ్చింది. అయితే.. నాలా ఫ్లో తగ్గడంతో వీటి మధ్య చిక్కుకునే అవకాశం ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి. నగరంలోని డ్రైన్ మ్యాప్ ఆధారంగా వివిధ మ్యాన్ హోల్స్ వద్ద గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గోపిశెట్టి రజనీకాంత్ కోసం సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మణికొండ నుంచి నెక్నా పూర్ చెరువు వరకు నాలాను క్షణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
కాగా.. గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్ (42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. కాగా.. రెండు రోజులు దగ్గరపడుతున్నా.. రజనీకాంత్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read: