Double Murder: నిజామాబాద్ జిల్లాలో దారుణం.. భార్యభర్తల మధ్య ఘర్షణ.. కన్నకూతురుతో సహా భార్యను నరికి చంపిన భర్త
అనుమానం పెను భూతమైంది. కట్టుకున్న భార్య, కన్న కూరుతురు అతి కిరాతకంగా కడతేర్చాడు ఓ కసాయి భర్త.
Man kills Wife and Daughter: అనుమానం పెను భూతమైంది. కట్టుకున్న భార్య, కన్న కూరుతురు అతి కిరాతకంగా కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా రుద్రుర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రుర్ మండల కేంద్రానికి గంగాధర్, మల్లీశ్వరి దంపతులు. వీరికి 13 ఏళ్ల కూతురుకు కూడా ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా అనుమానంతో భార్యను చిత్ర హింసలు పెడుతున్నట్లు స్థానికులు తెలిపారు.
ఇదే క్రమంలో గురువారం భార్యభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన గంగాధర్ ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య మల్లీశ్వరి (30), కూతురు రుత్విక (13)ను అతికిరాతకంగా నరికి హతమార్చాడు. ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉండటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు కారణాలపై విచారణ చేపట్టారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.