Crime News: పిల్లల కోసం దారుణం.. 16 నెలల పాటు మహిళపై అత్యాచారం.. నిందితుడికి సహకరించిన భార్య..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణం చోటు చేసుకుంది. ఒక దుర్మార్గుడు పిల్లల కోసం ఒక మహిళను 16 నెలల పాటు నిర్భంధించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు నిందితుడి..

Crime News:  పిల్లల కోసం దారుణం..  16 నెలల పాటు మహిళపై అత్యాచారం.. నిందితుడికి సహకరించిన భార్య..
Follow us
Basha Shek

|

Updated on: Nov 12, 2021 | 10:33 PM

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణం చోటు చేసుకుంది. ఒక దుర్మార్గుడు పిల్లల కోసం ఒక మహిళను 16 నెలల పాటు నిర్భంధించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు నిందితుడి భార్య కూడ సహకరించడం కొసమెరుపు. ఆతర్వాత బాధితురాలు బిడ్డను ప్రసవించడంతో సమీపంలోని బస్టాండ్‌లో వదిలిపెట్టేసి వెళ్లిపోయాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గుర్తించిన పోలీసులు ఆమెను విచారించగా.. అసలు విషయం బయటపడింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం..

పలు సెక్షన్లపై కేసులు.. ఉజ్జయినీలోని కధ్‌ బరోడా గ్రామానికి చెందిన రాజ్‌పాల్‌ సింగ్‌ తనకు తెలిసిన కొందరి వ్యక్తుల సహకారం, పలుకుబడిని ఉపయోగించుకుని 16 నెలల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల మహిళను ఉజ్జయినికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన సతీమణి చంద్రకాంత సహాయంతో పలుమార్లు ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాజ్‌పాల్‌ సింగ్‌- చంద్రకాంత దంపతులకు గతంలో ఇద్దరు పిల్లలు జన్మించి చనిపోయారు. దీంతో నాగ్‌పూర్‌కు చెందిన మహిళ సహాయంతో తల్లిదండ్రులు అవుదామని భావించారు. అందులో భాగంగానే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇటీవల బిడ్డను ప్రసవించడంతో నిందితుడు ఆమెను బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్‌పాల్‌ సింగ్‌ దంపతులతో పాటు వీరికి సహకరించిన వీరేంద్ర, కృష్ణపాల్‌, అర్జున్‌లపై హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, అత్యాచార యత్నం, కిడ్నాపింగ్‌ తదితర సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేశారు.

Also read:

Crime News: సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు.. అరెస్టైన మూడేళ్ల తర్వాత శిక్ష ఖరారు..

Telangana News: అది ఇవ్వలేదంటూ మెడికల్ షాపు ఎదుట ఓ యువకుడు వీరంగం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Death Mystery: అమ్మతనానికి మాయని మచ్చ.. అక్కడ చంపి.. ఇక్కడ పడేసింది.. పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ