Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు.. అరెస్టైన మూడేళ్ల తర్వాత శిక్ష ఖరారు..

సామూహిక అత్యాచారం కేసులో ఉత్తర ప్రదేశ్‌ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గాయత్రి ప్రజాపతికి లక్నో న్యాయస్థానం జీవితఖైదు విధించింది..

Crime News:  సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు.. అరెస్టైన మూడేళ్ల తర్వాత శిక్ష ఖరారు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 12, 2021 | 10:03 PM

సామూహిక అత్యాచారం కేసులో ఉత్తర ప్రదేశ్‌ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గాయత్రి ప్రజాపతికి లక్నో న్యాయస్థానం జీవితఖైదు విధించింది. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు అశోక్‌ తివారీ, ఆశిష్‌ శుక్లాలకు కూడా యావజ్జీవ శిక్షతో పాటు రూ. 2లక్షల జరిమానాను విధించింది. ఇదే కేసులో నిందితులైన వికాశ్‌ వర్మ, రూపేశ్వర్‌, అమరేంద్ర సింగ్‌, చంద్ర పాల్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులను గురవారమే దోషులుగా నిర్ధారించిన లక్నో కోర్టు శుక్రవారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు కోసం న్యాయస్థానం మొత్తం 17 మంది సాక్షులను విచారించింది.

తల్లీకూతుళ్లపై అఘాయిత్యం.. ఎస్పీ పార్టీకి చెందిన గాయత్రి ప్రజాపతి అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో రవాణా, మైనింగ్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా మంత్రితో పాటు ఆయన ఆరుగురు అనుచరులు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని చిత్రకూట్‌కు చెందిన ఓ మహిళ 2017 ఫిబ్రవరి 18న ఉత్తర ప్రదేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనింగ్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక పని కోసం లక్నో వచ్చిన ప్రజాపతి తనతో పాటు మైనర్‌ అయిన తన కుమార్తె పైనా అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కానీ పోలీసులు ఆమె కేసులో అలక్ష్యం వహించడంతో ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాధితురాలి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు మంత్రితో పాటు ఆయన అనుచరులపై సామూహిక లైంగిక దాడి, బెదిరింపులు, పోక్సో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. 2017 మార్చి 15న గాయత్రి ప్రజాపతిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న ఆయనకు తాజాగా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.

Also read:

Telangana News: అది ఇవ్వలేదంటూ మెడికల్ షాపు ఎదుట ఓ యువకుడు వీరంగం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Death Mystery: అమ్మతనానికి మాయని మచ్చ.. అక్కడ చంపి.. ఇక్కడ పడేసింది.. పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ

Tiger: నల్లమల అటవీ ప్రాంతంలో.. గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృత్యువాత..