AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేక్‌ తెచ్చిన తంటా.. నేరస్థుడికి తినిపించి అడ్డంగా బుక్కైన ఇన్స్‌పెక్టర్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Cop feeding cake to Criminal: సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే.. అక్కడున్న వారందరినీ ఆహ్వానిస్తుంటారు. ముక్కు.. మొఖం తెలియకపోయినా సరే పిలిచి వేడుకను నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో..

కేక్‌ తెచ్చిన తంటా.. నేరస్థుడికి తినిపించి అడ్డంగా బుక్కైన ఇన్స్‌పెక్టర్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Cop Feeding Cake To Criminal
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2021 | 3:25 PM

Share

Cop feeding cake to Criminal: సాధారణంగా ఎవరైనా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటే.. అక్కడున్న వారందరినీ ఆహ్వానిస్తుంటారు. ముక్కు.. మొఖం తెలియకపోయినా సరే పిలిచి వేడుకను నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో వచ్చినవారికి.. బర్త్ డే జరుపుకుంటున్న వారు కేక్ తినిపించడం కామన్. అలానే తన బర్త్ డే వేడుకకు వచ్చిన ఓ క్రిమినల్‌కు.. ఓ పోలీసు అధికారి కేక్‌ తినిపించి చిక్కుల్లో పడ్డారు. రెండు వారాల క్రితం జరిగిన బర్త్‌డే వేడుకలకు సంబంధించిన వీడియో, ఫొటో ఆలస్యంగా వెలుగుచూడటంతో.. ముంబై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. దీనిపై గురువారం ముంబై డీసీపీ మహేష్‌ రెడ్డి విచారణకు ఆదేశించడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.

ముంబైలోని పలు ప్రాంతాల్లో డానిష్ షేక్ అనే వ్యక్తిపై హత్యాయత్నం, పలు నేరాల కింద కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో డానిష్‌ను సబర్భన్ జోగేశ్వరి పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అయితే.. అదే స్టేషన్‌లో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేంద్ర నెర్లీకర్‌ పుట్టినరోజు వేడుకలను రెండు వారాల క్రితం హౌసింగ్‌ సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డానిష్‌కు మహేంద్ర కేక్‌ తినిపించారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత.. దాదాపు 15 సెకన్ల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ మహేష్ రెడ్డి ప్రాథమిక విచారణకు ఆదేశించారు. సకినాకా డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఈ విచారణను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మహేంద్ర నెర్లీకర్‌ను కంట్రోల్‌ రూమ్‌కు అటాచ్‌ చేశారు.

కాగా.. ఈ సంఘటనపై మహేంద్ర నెర్లీకర్‌ మాట్లాడుతూ.. ఇది పాత వీడియో అని తెలిపారు. కూల్చివేత పనులు జరుగుతున్న హౌసింగ్ సొసైటీని సందర్శించానని.. అదే రోజు తన పుట్టినరోజు కావడంతో కొందరు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో డానిష్‌ అక్కడ ఉన్నట్లు తనకు తెలియదంటూ పేర్కొన్నారు.

Also Read:

Cheat with QR Code: క్యూ ఆర్ కోడ్ ల తో మీ అకౌంట్ ఖాళీ చేసేస్తారు జాగ్రత్త.. అలా ఎలా చేస్తారో తెలుసా?

T-Series Bhushan Kumar : టి- సిరీస్ హెడ్ భూషణ్ కుమార్‌పై అత్యాచారం ఆరోపణలు.. ఎఫ్‌ఐఆర్ నమోదు..

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?