Maruthi Rao Suicide: మారుతీరావు మృతి కేసులో పలు అనుమానాలు..!
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీ రావు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌లో ఉన్న మారుతీ రావు.. హైదరాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీ రావు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌లో ఉన్న మారుతీ రావు.. హైదరాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ కేసులో ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాయిజన్ తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించగా.. ఆయన రూమ్‌లో విషం బాటిల్ మిస్ అయ్యింది. విషం తాగాక మారుతీరావు బాటిల్‌ను కిటికీ నుంచి పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లాస్‌తో పాటు మారుతీరావు బట్టలను, ఒంటిపై ఉన్న నురుగును ఫోరెన్సిక్‌కు పంపారు పోలీసులు. ఇక రాత్రి 8గంటల సమయంలో డ్రైవర్‌తో కలిసి బయటికి వెళ్లిచ్చిన మారుతీ రావు, 9గం.ల తరువాత ఎవ్వరికీ ఫోన్ చేయలేదు. ఈ క్రమంలో ఆయన ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు..? బయటకు వెళ్లినప్పుడు మారుతీ రావు డ్రైవర్‌తో ఏమైనా చెప్పాడా..? డ్రైవర్‌తో ఆయన ఎక్కడకు వెళ్లి వచ్చారు..? చివరగా ఆయన గదిలోకి వెళ్లారు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.
మారుతీరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం పూర్తి అయ్యింది. ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. సోమవారం మిర్యాలగూడలో మారుతీ రావు అంత్యక్రియలు జరగనున్నాయి.
Read This Story Also: కరోనా దెబ్బకు ఫేస్‌బుక్ ఆఫీసులు క్లోజ్