అందుకే అన్నయ్య ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు: మారుతీరావు సోదరుడు
తన అన్నతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మారుతీ రావు సోదరుడు తిరుణగారి శ్రవణ్ తెలిపాడు. తమ కుటుంబంలో ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని ఆయన స్పష్టం చేశాడు.
తన అన్నతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మారుతీ రావు సోదరుడు తిరుణగారి శ్రవణ్ తెలిపాడు. తమ కుటుంబంలో ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని ఆయన స్పష్టం చేశాడు. ప్రణయ్ కేసు ట్రయిల్ దశకు వచ్చిందని.. దాని వల్లే తన సోదురుడు ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పేర్కొన్నాడు. గత ఏప్రిల్ నుంచి తన అన్నతో మాటల్లేవని.. అలాగే తామిద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత సంబంధాలు కూడా లేవని వెల్లడించారు. తనకు సంబంధం లేకపోయినా.. ప్రణయ్ హత్య కేసులో జైలు శిక్షను అనుభవించానని.. ఈ రోజు ఆత్మహత్య విషయం తెలియగానే మా వదినను తీసుకొని నేరుగా హైదరాబాద్ వచ్చానని శ్రవణ్ తెలిపాడు.
Read This Story Also: మారుతీరావు ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు