Maruthi Rao suicide: మారుతీరావు ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలని మారుతీరావు మూడు రోజుల ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Maruthi Rao suicide: మారుతీరావు ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 08, 2020 | 12:49 PM

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలని మారుతీరావు మూడు రోజుల ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం స్నేహితుడి ఫెర్టిలైజర్ షాపు నుంచి పురుగుల మందును మారుతీ రావు కొనుగోలు చేసినట్లు సమాచారం. కూతురు అమృత విషయంలో మూడు నెలల నుంచి మారుతీ రావు అడ్వకేట్లతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుండగా.. ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలని అమృతతో మంతనాలు కూడా జరిపారట.

అంతేకాదు అమృతను కలవడం కోసం మిర్యాలగూడకు చెందిన వారితో కూడా మారుతీరావు రాయబారం పంపినట్లు సమాచారం. కానీ అమృత తన మాట వినకపోవడంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రణయ్ కేసు ఫైల్స్‌తో తరచుగా హైదరాబాద్‌కు వస్తోన్న మారుతీ రావు.. తాజాగా కూడా ప్రముఖ న్యాయవాదిని కలిసేందుకు నగరానికి వచ్చారట. ఇక శనివారం సాయంత్రం మినపగారెలు తెప్పించుకొని తిన్న మారుతీ రావు.. రాత్రి 12 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

మారుతీ రావు ఇంట్లో తీవ్ర గొడవలు ఇదిలా ఉంటే ప్రణయ్ హత్యతో కుటుంబ పరువు పోయిందిని మారుతీ రావుతో బంధువులు తరచుగా గొడవ పడ్డట్లు సమాచారం. ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని మారుతీ రావుతో ఆయన సోదరులు మూడు రోజులుగా గొడవ పడుతున్నారట. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆయన తీవ్ర మనస్తాపంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Read This Story Also: మారుతీరావు గురించి వైశ్య భవన్ మేనేజర్ ఏమన్నారంటే..!