Maruthi Rao suicide: మారుతీరావు మృతిపై కేసు నమోదు

మారుతీరావు మృతిపై కేసు నమోదైంది. మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేయాలని ఆయన బంధువు రఘు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Maruthi Rao suicide: మారుతీరావు మృతిపై కేసు నమోదు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 08, 2020 | 5:43 PM

మారుతీరావు మృతిపై కేసు నమోదైంది. మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేయాలని ఆయన బంధువు రఘు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైఫాబాద్ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో 174 ఐపీసీ కింద సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా ఈ కేసుపై డీఎస్పీ శ్రీనివాస్ స్పందించారు. మారుతీరావుకు కూతురంటే అమితమైన ప్రేమ అని ఆయన అన్నారు. ఈ నెల 10న ప్రణయ్ హత్య కేసు విచారణకు రానుందని.. అందులో మారుతీ రావుకు శిక్ష ఖరారు అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కఠిన శిక్ష పడితే మరింత పరువు పోతుందని భావించిన మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రణయ్ హత్య కేసులో మొత్తం 8మంది దోషులుగా తేలారని ఆయన అన్నారు. ఈ కేసులో మొత్తం 103 మంది సాక్షులను విచారించి.. 1600 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Read This Story Also: బ్రేకింగ్: అమరావతి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవు