ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. వీలునామా రద్దు చేయించిన తమ్ముడు! కారణమేంటంటే?
ప్రస్తుతం అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలను షాక్‌కి గురించి చేసింది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీ రావు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈయన ఆస్తి గురించి పలు విషయాలు కూడా తెరపైకి..
ప్రస్తుతం అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలను షాక్‌కి గురించి చేసింది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీ రావు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌లో ఉన్న ఆయన.. హైదరాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌లో విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పుడు మారుతీరావు ఆస్తి గురించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.
కాగా ఆస్తి విషయంలో.. పలు సంచలన విషయాలను బయటపెట్టారు మారుతీరావు సోదరుడు శ్రవణ్. “అన్నయ్య చనిపోయారన్న విషయం నాకు వదిన ఫోన్ చేసి చెప్తేనే తెలిసింది. దీంతో వెంటనే ఆమెను తీసుకుని మా కుటుంబమంతా హైదరాబాద్ వచ్చామని, గత మూడు నెలలుగా.. మా మధ్య మాటలు లేకపోయినా.. నన్ను ఈ వివాదంలో ఇరికిస్తున్నారని అన్నారు. అలాగే మా మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయన్నది అవాస్తవమన్నారు. ఆస్తి కోసం ఆయన్ని ఒత్తిడి చేశామనడం తప్పు.. మారుతీ రావు ఇప్పుడు ఏం తీసుకెళ్లాడు.. అలాగే నేను చనిపోతే ఏం తీసుకెళ్తాను’. అని శ్రవణ్ స్పష్టం చేశారు.
అలాగే.. 2018లో అంటే ప్రణయ్ హత్యకు ముందే అన్నయ్య వీలునామా రాశారు. దీనిపై తాను ప్రశ్నిస్తే.. ప్రణయ్ కుటుంబం నుంచి ప్రమాదం ఉందని సమాచారం వల్లే తాను ఈ వీలునామా రాసినట్టు అన్నయ్య చెప్పినట్టు శ్రవణ్ తెలిపారు. అనంతరం ఆ తర్వాత తానే ఒత్తిడి చేసి ఆ వీలునామా రద్దు చేయించానని శ్రవణ్ చెప్పారు. పొరపాటు మారుతీరావుకు ఏదైనా జరిగితే అది తన వల్లే జరిగిందని అనుమానాలు వస్తాయని భయంతోనే ముందుగా తాను వీలునామా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
అయతే మారుతీరావు మృతిపై అమృత చేసిన వ్యాఖ్యలను శ్రవణ్ తప్పు పట్టారు. అసలు మారుతీరావు ఏం తప్పు చేశారని? ఎందుకు పశ్చాత్తాప పడాలని ప్రశ్నించారు. మారుతీరావు షెడ్ 10, 12 సంత్సరాల నుంచి మూతపడి ఉంది. అందులోకి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తమకు తెలియదన్నారు శ్రవణ్.
Read More this Also: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!