దారుణం.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. వ్యక్తి తల బద్దలు కొట్టి
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లో ఓ సైకో పట్టగలే దారుణ హత్యకు తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ హత్య నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సైకో దాడిలో వ్యక్తి మృతి చెందినట్లు వీడియో..
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లో ఓ సైకో పట్టగలే దారుణ హత్యకు తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ హత్య నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సైకో దాడిలో వ్యక్తి మృతి చెందినట్లు వీడియో.. బయటకు రావడంతో ఈ ఘటన అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వైపుగా ఓ వ్యక్తి వెళ్తుండగా.. సరిగ్గా స్టేషన్ ముందుకు ఓ సైకో వచ్చి కర్రతో తలపై కొట్టడంతో.. ఒక్క దెబ్బతోనే అక్కడికక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు వ్యక్తి. అయితే రక్తపు మడుగులో పడివున్న అతన్ని చూసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి రవీందర్ అని.. ఇతను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడని పోలీసులు గుర్తించారు. కాగా.. గాంధీలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై పూర్తిగా విచారణ జరిపితే కానీ.. అసలు విషయాలు బయటపడే అవకాశం లేదని చెప్పారు పోలీసులు.
Read More: ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. వీలునామా రద్దు చేయించిన తమ్ముడు! కారణమేంటంటే?
Read More this also: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!