AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth Fitness Secret: 50 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా.. హీరో సుమంత్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ వంశం నుండి వచ్చిన హీరో సుమంత్ తన నటనతోనే కాకుండా, తన క్లాసిక్ లుక్స్ మరియు ఫిట్‌నెస్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ప్రస్తుతం 50 ఏళ్ల వయసుకు చేరువవుతున్నా, ఆయన ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా ఎంతో యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.

Phani CH
|

Updated on: Jul 11, 2026 | 6:30 PM

Share
షూటింగ్స్ లేనప్పుడు ఆయన రోజువారీ జీవితం ఎలా ఉంటుంది, ఆయన ఫిట్‌నెస్ వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా పంచుకున్నారు. సుమంత్ తనకు ఉదయం వేళలంటే చాలా ఇష్టమని, తాను 'మార్నింగ్ పర్సన్' అని చెప్పారు. షూటింగ్ లేని రోజుల్లో ఉదయం 6:30 నుండి 7:30 గంటల మధ్యలో నిద్ర లేస్తారు. నిద్ర లేవగానే ఆయన చేసే మొదటి పని తనకోసం తానే స్వయంగా రెండు కప్పుల టీ తయారు చేసుకోవడం. ఆ టీలో పాలు, చక్కెర చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటారు.

1 / 5
టీ కప్పుతో తన ఇంటి తోటలోకి వెళ్లి, ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మొక్కలను, ఆకులను చూస్తూ దాదాపు రెండు గంటల సమయం గడుపుతారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయం నుండి ఆయనకు ఈ గార్డెనింగ్ హాబీగా మారిందని, ఇది తన తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు గారి నుండి వచ్చి ఉండవచ్చని సుమంత్ గుర్తుచేసుకున్నారు.

2 / 5
ఉదయం ప్రశాంతత తర్వాత సుమంత్ ప్రతిరోజూ క్రమం తప్పకుండా రెండు గంటల పాటు జిమ్‌లో వర్కవుట్ చేస్తారు. ఈ వర్కవుట్ సమయంలో బోర్ కొట్టకుండా వెయిట్స్ లిఫ్ట్ చేస్తూనే ఏదైనా సినిమా, షో లేదా పాడ్‌కాస్ట్ వినడం ఆయనకు అలవాటు. ఇక ఆహారం విషయానికి వస్తే, సుమంత్ హోమ్ ఫుడ్ (ఇంటి వంట) తినడానికే ఇష్టపడతారు.

3 / 5
వారి కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా వండుతున్న వంట ఆవిడను తన సొంత సోదరిలా భావిస్తానని చెప్పారు. తను తినే ఆహారంలో 80 శాతం చాలా హెల్తీగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. షూటింగ్స్ లేనప్పుడు సుమంత్ తన ఇంట్లోని హోమ్ థియేటర్ లో ఐదారు గంటల పాటు సినిమాలు చూస్తూ గడుపుతారు. ఏదైనా మంచి సినిమా వస్తే థియేటర్ కి వెళ్లి మార్నింగ్ షో చూడటం ఆయనకు ఇష్టం.

4 / 5
ఒక్కోసారి స్నేహితులతో, మరికొన్ని సార్లు ఒంటరిగా వెళ్లి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదిస్తారు. ఖాళీ సమయాల్లో తన సోదరి, తండ్రి మరియు మనవరాళ్లతో కలిసి సమయం గడుపుతారు. జీవితంలో వచ్చే విమర్శలను లేదా ప్లాన్స్ అనుకున్నట్లు జరగకపోవడాన్ని తాను ఓవర్ థింక్ చేయనని, ప్రతి విషయాన్ని బ్యాలెన్స్‌డ్‌గా తీసుకుంటానని సుమంత్ చాలా హుందాగా చెప్పారు.

5 / 5
Follow Us