ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయే.. హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఈమె. ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలు చేసి.. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన నటుడు రాజేష్ కుమార్తె ఈ ఐశ్వర్య రాజేష్.
ఐశ్వర్య రాజేష్ జనవరి 10న ఈమె పుట్టిన రోజు. 1990లో ఈమె జన్మించింది. జీవితంలో చాలా చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించింది.
సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది. 2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టాకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఐశ్వర్య రాజేష్.
ఇక ఐశ్వర్య రాజేష్ సినిమాల విషయానికి వస్తే.. ఐశ్యర్య రాజేష్ విషయానికొస్తే.. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో పరిచయమైంది. అంతకు ముందు పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య రాజేష్, తనకు మొదట్లో హీరోయిన్‌గా అవకాశాలు రావడం అంత సులభం కాదని గుర్తు చేసుకున్నారు.
నువ్వు చాలా సాధారణంగా కనిపిస్తున్నావు.. హీరోయిన్ మెటీరియల్ కాదు” అని చాలామంది చెప్పారని, ఆ మాటలు తనను బాధపెట్టినా వెనక్కి తగ్గలేదని చెప్పారు.
క్రమంగా మంచి కథలను ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకున్నానని వివరించారు. తమిళంలో వచ్చిన ‘క పే రణసింగం’ సినిమా తన కెరీర్‌లో కీలక మలుపు అని ఆమె అన్నారు.