AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో విషాదం.. సింగర్ ఎస్ జానకి మృతి..

టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజండరీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజండరీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకి మృ తుదిశ్వాస విడిచారు. ఎస్‌. జానకి ఒక చిన్న పాపలా ఆమె పాడగలదు.

ఇండస్ట్రీలో విషాదం.. సింగర్ ఎస్ జానకి మృతి..
S Janaki
Rajitha Chanti
|

Updated on: Jul 11, 2026 | 8:36 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజండరీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజండరీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకి మృ తుదిశ్వాస విడిచారు. ఎస్‌. జానకి ఒక చిన్న పాపలా ఆమె పాడగలదు. ఎలాంటి సందర్భాన్నైనా తన గళంలో పలికించగలదు. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఈమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొందారు.

తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ జానకి. ముఖ్యంగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన అద్భుతమైన స్వరంతో కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన మహోన్నత గాయని ఆమె. సినీ అభిమానులు, సంగీత ప్రియులు ఆమెను గౌరవంగా ‘జానకమ్మ’ అని పిలుచుకుంటారు. జానకమ్మ 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగ రీత్యా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఉన్న ఆసక్తితో నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. మూడవ ఏట నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయట్టు’ ద్వారా ఆమె గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి టి.చలపతిరావు సంగీతం అందించారు. అదే ఏడాది ‘ఎమ్మెల్యే’ సినిమాలోని “నీ నవ్వే నీ జగాన…” అనే పాటతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ, ఒడియా వంటి దాదాపు 17 భాషల్లో 50,000 పైగా పాటలు పాడి భారతీయ సంగీత రికార్డుల్లో నిలిచారు.

చిన్న పిల్లల గొంతుతో పాడాలన్నా, పండితులను మెప్పించే శాస్త్రీయ సంగీతమైనా, పల్లె పదాల జానపదాలైనా జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. ‘స్వాతిముత్యం’ సినిమాలో “చిన్నారి పొన్నారి కిట్టయ్య…” పాటలో ఆమె పలికించిన పసితనం ఎప్పటికీ మరువలేనిది. పాటలో భావాన్ని, ఎమోషన్‌ను పలకించడంలో ఆమె శైలి ప్రత్యేకం. గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది యుగళ గీతాలు (Duets) టాలీవుడ్‌లో ఒక సువర్ణ అధ్యాయం. ఉత్తమ గాయనిగా 4 జాతీయ అవార్డులు అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బోలెడన్ని నంది అవార్డులు ,ఇతర రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ వచ్చింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ అవార్డును, దక్షిణ భారత కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు ఆలస్యంగా దక్కిందనే కారణంతో ఆమె నమ్రతతో తిరస్కరించడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం అనే చెప్పాలి.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..

Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా