భర్త కిరాతకం..నిద్రిస్తున్న భార్యకు కరెంటు షాక్

కృష్ణా జిల్లా నందిగామ మండలంలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భార్యకు కరెంటు షాక్‌ ఇచ్చి హతమార్చేందుకు ప్రయత్నించాడో కిరాతక భర్త. నందిగామ మండలం అంబారుపేటకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి తన భార్య అరుణ నిద్రిస్తున్న సమయంలో కరెంటు షాక్‌ ఇచ్చి చంపేందుకు ప్రయత్నించాడు. బాధ తట్టుకోలేక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరిగెత్తుకొని వస్తున్నారని గ్రహించిన జానకిరామయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన అరుణను నందిగామలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి […]

భర్త కిరాతకం..నిద్రిస్తున్న భార్యకు కరెంటు షాక్
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 25, 2019 | 9:06 PM

కృష్ణా జిల్లా నందిగామ మండలంలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భార్యకు కరెంటు షాక్‌ ఇచ్చి హతమార్చేందుకు ప్రయత్నించాడో కిరాతక భర్త. నందిగామ మండలం అంబారుపేటకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి తన భార్య అరుణ నిద్రిస్తున్న సమయంలో కరెంటు షాక్‌ ఇచ్చి చంపేందుకు ప్రయత్నించాడు. బాధ తట్టుకోలేక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరిగెత్తుకొని వస్తున్నారని గ్రహించిన జానకిరామయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన అరుణను నందిగామలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.