ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. రూ. 200 అప్పు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని కాల్చి చంపిన యువకుడు
అప్పుగా రూ.200 ఇవ్వలేదన్న కారణంతో ఏకంగా నిండు ఓ ప్రాణాన్ని బలితీసుకున్నాడో వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ దారుణం జరిగింది.
అప్పుగా రూ.200 ఇవ్వలేదన్న కారణంతో ఏకంగా నిండు ఓ ప్రాణాన్ని బలితీసుకున్నాడో వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ దారుణం జరిగింది. స్థానిక షంషాద్ సివిల్ లైన్స్ ప్రాంతంలో రద్దీగా ఉన్న మార్కెట్‌లో అన్సార్ అహ్మద్(30) దుకాణం వద్దకు శనివారం అసిఫ్ అనే ఓ వ్యక్తి వచ్చి రూ.200 అప్పుగా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు అహ్మద్ నిరాకరించాడు. ఇదే క్రమంలో అసిఫ్ నాటు తుపాకీతో అహ్మద్ తలపై కాల్చడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్సార్ అహ్మద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషాద్ మార్కెట్లో టైర్ మరమ్మతు దుకాణం నిర్వహిస్తున్నాడు. నిందితుడు అసిఫ్ మాదకద్రవ్యాల బానిసనని రూ. 200 ఇవ్వాలంటూ అహ్మద్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు అతడు నిరాకరించడంతో, ఆసిఫ్ తన జేబులో ఉన్న దేశీయ పిస్టల్‌తో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అహ్మద్ తలపై కాల్పడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయినట్లు పోలీసు సూపరింటెండెంట్ (సిటీ) అభిషేక్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న అసిఫ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.