Jammu Kashmir: సెల్స్‌మెన్‌పై కాల్పులు.. 24 గంటల వ్యవధిలో మరొకరిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు..
Man shot dead by terrorists: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మళ్లీ సాధారణ ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. జమ్మూలోని
Man shot dead by terrorists: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మళ్లీ సాధారణ ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. జమ్మూలోని శ్రీనగర్‌లో 24 గంటల వ్యవధిలో ఉగ్రవాదులు మరొకరిని పొట్టనబెట్టుకున్నారు. బొహ్రి కదల్ ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉగ్రవాదులు సాధారణ పౌరుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించకముందే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి బందిపొర జిల్లాకు చెందిన మొహమ్మద్ ఇబ్రహీంగా గుర్తించారు. ఇబ్రహీం మహరాజ్‌గంజ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం సాయంత్రం బాటామాలూ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పోలీసు కానిస్టేబుల్ ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. 24గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో భద్రతా బలగాలు అన్ని ప్రాంతాల్లో అలెర్ట్ జారీ చేశారు.
ఉగ్రవాదులు సాధారణ పౌరుడి హత్య ఘటనను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఇలాంటి చర్యలు సిగ్గుచేటని పేర్కొన్నారు. కాగా.. జమ్మూకాశ్మీర్‌లో వరుస హత్యల అనంతరం పోలీసులు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం.. అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు.
Terrorists fired upon a civilian in Bohri Kadal area of old Srinagar. He is hospitalized; condition is critical: Jammu & Kashmir Police
— ANI (@ANI) November 8, 2021
Also Read: