AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. తన లవర్ మరొకరికి దక్కకూడదంటూ ప్లాన్.. యువతి ఇంటికెళ్లి కాల్పులు.. వదిన మృతి..

Man kills lover's sister-in-law: తాను ప్రేమించిన యువతి.. మరొకరితో వివాహం చేసుకుంటుందని.. ఓ దుర్మార్గుడు రగిలిపోయాడు. రాత్రి వేళ ఇంట్లోకి ప్రవేశించి తుపాకీతో కాల్పులు

దారుణం.. తన లవర్ మరొకరికి దక్కకూడదంటూ ప్లాన్.. యువతి ఇంటికెళ్లి కాల్పులు.. వదిన మృతి..
Man kills lover's sister-in-law
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2021 | 12:57 PM

Share

Man kills lover’s sister-in-law: తాను ప్రేమించిన యువతి.. మరొకరితో వివాహం చేసుకుంటుందని.. ఓ దుర్మార్గుడు రగిలిపోయాడు. రాత్రి వేళ ఇంట్లోకి ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి వదినకు బుల్లెట్ తగలంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతి వేరొకరికి సొంతం అవుతుందనే కోపంతో యువకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్‌(24) అనే యువకుడు ఘజియాబాద్‌ జిల్లాలోని షేర్‌పూర్‌ గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అయితే సదరు యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న రోహిత్‌ కోపంతో రగిలిపోయాడు.

తాను ప్రేమించిన యువతి మరొకరికి దక్కకూడదని ప్రణాళిక రచించాడు. గురువారం రాత్రి షేర్‌పూర్‌ గ్రామంలోని యువతి ఇంటికి వెళ్లాడు. అనంతరం యువతిని బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. కుటుంబసభ్యులందరూ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో యువతి వదిన పవిత్రకు బులెట్లు తగిలాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాల్పుల శబ్దంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఈ క్రమంలో స్థానికులు రోహిత్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. రోహిత్‌ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయాడు. కాగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పవిత్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా తాను ప్రేమించిన యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయించారనే కోపంతో రోహిత్ కాల్పులకు తెగబడ్డాడని ఎస్‌ఐ ఇరాజ్‌ రాజా వెల్లడించారు. రోహిత్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

Also Read:

Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం.. త్వరలో ఆన్‌లైన్‌ కిరాణ డెలివరీ సేవలు

Tv9 Telugu No.1 Website: డిజిటల్ మీడియాలో సత్తా చాటిన టీవీ9 తెలుగు.. నెంబర్‌ 1 స్థానంలో వెబ్‌సైట్