Centring worker killed in hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో వ్యక్తి హత్య..
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తి హత్యచేశాడు. జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీలో అజయ్, పురుషోత్తం అనే ఇద్దరు వ్యక్తులు సెంట్రింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు.
Centring worker killed in hyderabad : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తి హత్యచేశాడు. జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీలో అజయ్, పురుషోత్తం అనే ఇద్దరు వ్యక్తులు సెంట్రింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు. సాయంతం పని పూర్తిచేసుకొన్న తర్వాత ఇద్దరూ కలిసి ఫుల్లుగా మద్యం సేవించారు. ఆతర్వాత ఓ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ గొడవకాస్త ముదరడంతో ఇద్దరు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఆవేశంలో అజయ్ పురుషోత్తంను ఇటుకతో తీవ్రంగా కొట్టాడు. తీవ్రగాయాలైన పురుషోత్తం అక్కడికక్కడే కన్నుమూశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :