40ఏళ్ల వ్యక్తికి 30ఏళ్ల కూతురు.. బ్యాంకు డబ్బులపై కన్నేసిన యువతి.. తండ్రి చనిపోయాడంటూ తప్పుడు డెత్ సర్టిఫికేట్లు..!

మృతుని ఖాతాలోని సొమ్ము తీసుకునేందుకు వచ్చిన యువతి మృతునికి సంబంధించి మూడు డెత్ సర్టిఫికెట్లను చూపించింది.

40ఏళ్ల వ్యక్తికి 30ఏళ్ల కూతురు.. బ్యాంకు డబ్బులపై కన్నేసిన యువతి.. తండ్రి చనిపోయాడంటూ తప్పుడు డెత్ సర్టిఫికేట్లు..!
Follow us

|

Updated on: Jan 31, 2021 | 1:13 PM

Man killed three times for pension : మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది.. రక్తసంబంధాలు సైతం ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. డబ్బు కోసం ఎంతటి పనినైనా సిద్ధపడుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా బ్యాంకు ఖాతాలోని పింఛను మొత్తం కోసం ఒక వ్యక్తిని మూడుసార్లు చంపేశారు. మృతుని ఖాతాలోని సొమ్ము తీసుకునేందుకు వచ్చిన యువతి మృతునికి సంబంధించి మూడు డెత్ సర్టిఫికెట్లను చూపించింది. దీంతో బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో అసలు వ్యవహరం వెలుగులోకి వచ్చింది. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే 40 ఏళ్ల వ్యక్తి బ్యాంకు ఖాతాకు గత పదేళ్లుగా వృద్ధాప్య పింఛను జమ అవుతోంది. ఈ విషయం వెల్లడి కావడంతో అధికారులు ఆ బ్యాంకు ఖాతాకు సంబంధించిన లావాదేవీలన్నింటినీ నిలిపివేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన గ్వాటోలీ బ్రాంచిలో మకరాబర్ట్ గంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ హలీమ్ పేరుతో ఖాతా ఉంది. ఇందుకు సంబంధించిన ఖాతాను జూన్ 2001లో ఈ ఖాతాను తెరిచారు. ఈ ఖాతాలో మొత్తం రూ. 52,899లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే, 2011 ఏప్రిల్ తరువాత ఈ ఖాతా అప్‌డేట్ కాలేదు.

అయితే, మహమ్మద్ హలీమ్ పేరుతో ఉన్న ఖాతాలో వృద్ధాప్య పింఛనుతో పాటు వడ్డీ కూడా జమ అవుతోంది. గత ఏడాది డిసెంబరు వరకూ ఈ ఖాతాలో పింఛను మొత్తం జమ అవుతూ వచ్చింది. కాగా జనవరి 27న అర్షాఖాన్ అనే యువతి బ్యాంకుకు వచ్చి, తన తండ్రి హలీమ్ 2017లో మరణించాడని తెలియజేసింది. తండ్రి మరణానికి సంబంధించిన డెట్ సర్టిఫికెట్ కూడా బ్యాంకు అధికారులకు చూపించింది. తరువాత బ్యాంకు నుంచి తండ్రి పేరుతో ఉన్న సొమ్ము తీసుకునేందుకు నింపాల్సిన ఫారాలను కూడా నింపింది. దానితోపాటు తండ్రి 2011లో మృతి చెందినట్లు ఉన్న డెత్ సర్టిఫికెట్‌ను బ్యాంకు అధికారులకు అందజేసింది. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు యువతిని నిలదీయడంతో అసలు వ్యవహరం బయటపడింది. హలీమ్ 2017లో చనిపోయాడని చెప్పి, 2011నాటి డెట్ సర్టిఫికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఆ మహిళ నుంచి సమాధానం రాకపోవడంతో అసలు సర్టిఫికేట్ కోసం ఆరా తీశారు.

దీంతో వారు హలీమ్‌కు సంబంధించిన ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ తీసుకురమ్మని ఆమెకు చెప్పి పంపించారు. ఆమె కొద్దిసేపటి తరువాత 2018కి సంబంధించిన తండ్రి డెత్ సర్టిఫికెట్ అధికారులకు అందజేసింది. అయితే, ఒక వ్యక్తికి సంబంధించిన మూడు డెత్ సర్టిఫికెట్లను చూసిన బ్యాంకు అధికారులు కంగుతిన్నారు. దీంతో ఆమెను ఈ విషయమై ప్రశ్నించడంతోపాటు ఆ ఖాతాను సీజ్ చేశారు. అర్షాఖాన్‌ను విచారించిన అధికారులు ఆ డెత్ సర్టిఫికెట్లలో 2011లో ఉన్నదే అసలైన డెత్ సర్టిఫికెట్ అని గుర్తించారు. మిగిలిన రెండు డెత్ సర్టిపికెట్లు నకిలీవని అధికారులు తేల్చేశారు.

ఇదిలావుంటే, బ్యాంకు రికార్డుల ప్రకారం మొహమ్మద్ హలీమ్ పుట్టిన సంవత్సరం 1980 అని ఉంది. దీని ప్రకారం అతనికి ఇప్పుడు 40 ఏళ్లు. అతని కుమార్తెను అని చెప్పుకుని బ్యాంకుకు వచ్చిన యువతి వయసు 30 ఏళ్లు. దీంతో బ్యాంకు అధికారులకు ఆ యువతిపై అనుమానం వచ్చింది. అదేవిధంగా 40 ఏళ్ల వ్యక్తికి వృద్ధాప్య పింఛను రావడంపై కూడా అనుమానం తలెత్తింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బ్యాంకు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, హలీమ్ సంబంధించిప వివరాలపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. హలీమ్ కుటుంబ సభ్యులు ఎనిమిదేళ్ల క్రితమే అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారికి సంబంధించి పూర్తి వివరాలు తెలియదని ఇరుపొరుగు వారు సమాధానం ఇచ్చారు. దీంతో హలీమ్ పేరుతో బ్యాంకును బురిడీ కొట్టించేందుకు వచ్చిన యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు అధికారులు.

ఇదీ చదవండిః ఐదేళ్ల బాలికపై ఆత్యాచారం, హత్య కేసులో సేలం కోర్టు సంచలన తీర్పు.. 21 ఏళ్ల యువకుడికి 35 ఏళ్ల జైలు శిక్ష