11 January 2025
యానిమల్ బ్యూటీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. ఎందుకంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మరింత క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ త్రిప్తీ డిమ్రి. పాన్ ఇండియాలోనే ఆమె చాలా ఫేమస్.
అంతకు ముందు హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిప్తికి.. యానిమల్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది.
ఈ సినిమా తర్వాత త్రిప్తికి హిందీలో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతుంది.
కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో విమర్శలు, అవమానాలు సైతం ఎదుర్కొంది ఈ అమ్మడు. అవకాశాల కోసం ఎంతో కష్టపడాల్సింది వచ్చిందట.
సినిమాలకు తనను ఎంపిక చేసుకుని చివరి క్షణం తప్పించారని.. అలాగే అడిషన్స్ కు వెళ్లిన ప్రతిసారి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయట.
యానిమల్ సినిమాకు ముందు త్రిప్తి ఎలా ఉండేది అనేది తన స్నేహితులకు మాత్రమే తెలుసునని.. ఇంకెవ్వరికీ తెలియదని చెప్పుకొచ్చింది.
కేవలం సక్సెస్ అయిన వాళ్లు చెబితేనే వింటారని.. ఫెయిలైన వాళ్లు చెబితే జనాలు కూడా వినరని తన అసహనాన్ని వెళ్లగక్కింది ఈ బ్యూటీ.
అలాగే తన రిలేషన్ షిప్ గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. కేవలం వ్యాపారవేత్తతో తనకు ఉన్నది స్నేహం మాత్రమే అని తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్