Crime: అశ్లీల కాల్స్ పేరిట మెస్సెజ్.. ఫోన్ చేస్తే బుక్కవ్వాల్సిందే.. కర్నూలులో నయా దందా గుట్టురట్టు
Pornographic Calls: అడ్డదారిలో డబ్బు సందపాదించాలనుకున్నారు. దీనికోసం కాల్ గర్ల్స్ పేరిట మెసెజ్‌లు పంపడం, అశ్లీల వీడియోలను, ఫొటోలను పంపించడం లాంటివి చేసి వల పన్నేవారు. దీంతోపాటు అశ్లీల వీడియో కాల్స్ చేయిస్తామంటూ
Pornographic Calls: అడ్డదారిలో డబ్బు సందపాదించాలనుకున్నారు. దీనికోసం కాల్ గర్ల్స్ పేరిట మెసెజ్‌లు పంపడం, అశ్లీల వీడియోలను, ఫొటోలను పంపించడం లాంటివి చేసి వల పన్నేవారు. దీంతోపాటు అశ్లీల వీడియో కాల్స్ చేయిస్తామంటూ రూ.300ల నుంచి రూ.5వేల వరకూ డిమాండ్ చేసేవారు. అలాంటి ముఠా ఆటకట్టించారు ఏపీలోని కర్నూలు జిల్లా పోలీసులు. అశ్లీలమైన విడియోలను, ఫోటోలను పంపి ఆన్ లైన్ విడియో కాల్స్ చేయిస్తామని డబ్బు తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కర్నూలు వన్‌టౌన్ సీఐ కె. కళావెంకటరమణ పేర్కొన్నారు. నిందితులు మార్కెటింగ్ యాప్స్ వినియోగించుకుని సాధారణ ప్రజలకు కాల్ గర్ల్స్ సప్లయ్ చేస్తామని, అశ్లీల విడియో కాల్స్ చేయిస్తామని రూ.300 ల నుంచి రూ. 5,000 వరకు దండుకుంటున్నారని తెలిపారు. ఈ ముఠా పలు యాప్‌లను ఉపయోగించి.. ఒకేసారి 100 నుంచి 1000 మంది వరకు బల్క్ మేసేజ్‌లు పంపేవారని తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది వీరి వలలో చిక్కుకొని అత్యధికంగా డబ్బులు చెల్లించేవారని తెలిపారు. ఈ విధంగా చాలామంది మోసపోయినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఆ తర్వాత నిందితులు.. బాధితులను ఫోన్ ద్వారా భయపెడుతూ డబ్బులు వసూలు చేసేవారని పేర్కొన్నారు.
ఈ ఘటనలో పగిడ్యాల గ్రామానికి చెందిన తెలుగు జనార్ధన్, కర్నూలుకు చెందిన బెస్త ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు దాదాపు రెండేళ్ల నుంచి ఈ విధంగా మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పలువురి నుంచి అందిన సమాచారం మేరకు.. తమ బృందం వారిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఇలా రోజుకు సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ మేరకు నిందితులకు సంబంధించిన పలు బ్యాంక్ అకౌంట్లను గుర్తించి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్స్, మహేంద్ర కంపెనీ కారు, 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కళావెంకటరమణ పేర్కొన్నారు.
Also Read: