Tragedy: పరువు పోయిందని.. ఐదుగురు బలవన్మరణం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
Family Suicide: కర్ణాటకలోని కోలార్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. శిశువు విషయంలో అబద్దం ఆడిన ఓ కుటుంబం.. పరువు పోయిందనే బాధతో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో సోమవారం
Family Suicide: కర్ణాటకలోని కోలార్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. శిశువు విషయంలో అబద్దం ఆడిన ఓ కుటుంబం.. పరువు పోయిందనే బాధతో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో సోమవారం ఓ కుటుంబంలోని ఐగుగురు విషం తాగి మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మునియప్ప (75), నారాయణమ్మ (70), బాబు (45), గంగోత్రి (17), పుష్ప (33) గా గుర్తించారు. ఐదుగురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోసూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని.. కోలార్ పట్టణానికి చెందిన యువకుడు ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలాకాలంపాటు సహజీవనం చేయగా.. ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆ యువతి భయపడి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఆమె తండ్రి.. చాలాసార్లు ఇంటికి రావాలంటూ ఫోన్ చేసినా.. యువతి నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆయువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తల్లికి చెప్పగా.. ఆమె కోలార్ కు వచ్చింది. తన కుమార్తె, మనవరాలితో కొన్ని రోజులు గడిపిన తర్వాత.. ఆ యువతి తల్లి తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ తరుణంలో యువతి తన తల్లికి తోడుగా వెళ్లాలని నిర్ణయించుకొని.. పొరుగున నివసించే కరంజికట్టా నివాసి అయిన పుష్పకు బిడ్డను అప్పగించి వెళ్లారు. మళ్లీ వచ్చి తీసుకుంటామని చెప్పడంతో పుష్పకూడా పిల్ల ఆలనాపాలనా చూసేందుకు ఒప్పుకుంది.
20 రోజుల తర్వాత ఇంటినుంచి వచ్చిన తరువాత 31న కోలార్‌కు తన పాపను ఇవ్వాల్సిందిగా ఆ యువతి పుష్పను కోరింది. అయితే.. తనకు ఎవ్వరినీ ఇవ్వలేదంటూ పుష్ప.. బిడ్డను ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బాధిత యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. తనకు న్యాయం చేయాలని కోరింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన గల్‌పేట పోలీసులు మునియప్ప, ఆయన కుటుంబ సభ్యులను ఈ విషయంపై విచారించారు. సీసీ కెమెరాల్లో సైతం పిల్లను తీసుకున్నట్లు కనిపించింది. అయితే.. విచారణ జరుగుతున్న క్రమంలో తమ కుటుంబ పరువు పోయిందనే బాధతో ఐదుగురు విషం తాగారు. గమనించిన స్థానికులు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ముందు నలుగురు మృతి చెందగా.. అనంతరం చికిత్స పొందుతూ మునియప్ప కుమార్తె పుష్ప కూడా మరణించినట్లు గల్‌పేట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: