Watch Video: వీడు మాములోడు కాదు.. చూసినట్లే చూసి గుడిలో హుండీని తవ్వుకెళ్లాడు..

ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై దేవుడి మరీ కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు.. ఇది గతంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌ ప్రాంతంలోనే ఓ ఆలయంలో జరిగిన ఘటన. ఇప్పుడు ఈ దొంగకు భయం లేదు.. బిడియం లేదు.. భక్తి అంతకన్నా లేదు..

Watch Video: వీడు మాములోడు కాదు.. చూసినట్లే చూసి గుడిలో హుండీని తవ్వుకెళ్లాడు..
Thief Steals Hindi
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 10, 2021 | 12:26 PM

ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై దేవుడి మరీ కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు.. ఇది గతంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌ ప్రాంతంలోనే ఓ ఆలయంలో జరిగిన ఘటన. ఇప్పుడు ఈ దొంగకు భయం లేదు.. బిడియం లేదు.. భక్తి అంతకన్నా లేదు.. ఏకంగా దేవుడి సొత్తుకే టెండర్ పెట్టాడు ఓ దొంగ. గుంటూరుజిల్లాలో ఓ దొంగ ఏకంగా హుండినే ఎత్తుకెళ్లాడు. పక్కా ప్లాన్‌తో వచ్చిన అతను.. చాకచాక్యంగా హుండీని పెకలించి బైక్‌పై పట్టుకెళ్లాడు. గుంటూరుజిల్లా రాజుపాలెం మండలం ఆర్‌ఆర్‌ సెంటర్‌లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. విగ్రహం ఎదుట భక్తులు కానుకలు సమర్పించేందుకు హుండీని ఏర్పాటు చేశారు. ఇది గమనించిన ఓ దొంగ.. అర్ధరాత్రి బైక్‌పై వచ్చాడు. వస్తూ వస్తూ గడ్డపారను వెంట తెచ్చుకున్నాడు. మెట్లపైన ఉన్న హుండీని గడ్డపారతో పెకిలించి హుండీని బైక్‌పై పెట్టుకుని వెళ్లిపోయాడు. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్‌ వేసుకున్నాడు దొంగ. ఇదంతా పక్కా ప్లాన్‌తోనే చేసినట్టు స్పష్టమవుతోంది. అయితే అతను లోకల్‌ దొంగా.. వేరే ప్రాంతం నుంచి వచ్చి హుండీని ఎత్తుకెళ్లాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించేపనిలో పడ్డారు. స్థానికులు మాత్రం దొంగతనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది దొంగతనం కాదు.. ఎవరో కావాలనే ముందస్తు ప్లాన్‌తో ఇలా చేశారని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: శత్రువును ద్వేషించకు స్నేహితుడిలా చూడు.. చాణక్యుడు చెప్పిన సక్సెస్ సీక్రెట్ ఇదే..

Mukesh Ambani Antilia Case: ముఖేష్ అంబానీ కుటుంబానికి ఎలాంటి ముప్పు లేదు.. చిరునామా అడిగిన వ్యక్తి ఎవరో తేల్చిన పోలీసులు..