Cheater Arrest: చదివింది బీటెక్.. చేసేది లోటెక్.. 300 మంది అమ్మాయిలకు టోకరా.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు!

ఎవరు ఎంత అప్రమత్తం చేసినా.. ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సోషల్ మీడియా మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా మూడు వందల మంది అమ్మాయిలను మోసం చేశాడు ఓ కేటుగాడు.

Cheater Arrest: చదివింది బీటెక్.. చేసేది లోటెక్.. 300 మంది అమ్మాయిలకు టోకరా.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు!
Young Man Who Cheats Girls And Aunties

Kadapa Young man arrested who cheats Women: ఎవరు ఎంత అప్రమత్తం చేసినా.. ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సోషల్ మీడియా మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో పెరుగుతున్న మోసాలు అటు పోలీసులను, ఇటు తల్లితండ్రులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ కేటుగాడు అందమైన ముఖం అడ్డం పెట్టుకుని ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు వందల మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఎట్టకేలకు ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్‌తో మొత్తం చిట్టా బయటపడింది.  200 మంది కాలేజీ అమ్మాయిలు.. వందమంది వివాహితలు, మహిళలను మాయలోడు ట్రాప్ చేశాడట.. !

సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలకు, పెళ్లయిన ఆంటీలకు వల విసురుతాడు. చూడచక్కని రూపంతో వాళ్లను బుట్టలోకి వేసుకుంటాడు. మాటలతో మభ్యపెట్టి ముగ్గులోకి దించుతాడు. ఎలాగోలా వారి నుంచి నగ్నంగా, అర్ధనగ్నంగా ఫొటోలు సేకరిస్తాడు. తర్వాత, వీటిని అడ్డుపెట్టుకుని ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటాడు. అన్నీ కుదిరితే వారితో శారీరకంగా లొంగదీసుకుంటాడు. ఇందుకోసం ఎంత దూరమైన వెళ్తాడు. అతని మాయలో పడ్డ అమ్మాయిలతో పాటు అంటీలు కూడా ఉండటం విశేషం.. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పనిగా పెట్టుకున్న ఓ నీచుడి బండారం బయటపడింది. మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈ కేటుగాడిని ఎట్టకేలకు కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్‌తో పేజీ క్రియేట్ చేసుకుంటాడు. మెల్లగా పరిచయం పెంచుకుని చాటింగ్ పేరుతో దగ్గరవుతాడు. ఇలా ఏకంగా 200 మంది అమ్మాయిలు, 100 మంది మహిళలను లోబరుచుకుని మోసం చేసినట్లు కడప జిల్లా పోలీసులు చెప్పారు. ఆంధ్రా, తెలంగాణలోని పలు ప్రాంతాలు.. ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్, కడపలో అమ్మాయిలకు ఎర వేసినట్లు పోలీసులు గుర్తించారు. వారికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని అసభ్యకరమైన రీతిలో చాటింగ్‌ చేస్తూ వారి అర్ధనగ్న ఫొటోలను సేవ్‌ చేసుకుని తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

అరెస్టయిన వ్యక్తిని కడప డీఎస్పీ సునీల్‌ ఆదివారం మీడియా ఎదుట హాజరుపరిచారు. డీఎస్పీ సునీల్ తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రసన్న కుమార్‌ అలియాస్‌ ప్రశాంత్‌రెడ్డి, అలియాస్‌ రాజారెడ్డి, అలియాస్‌ టోనీ.. బీటెక్‌ వరకు చదివాడు. చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటుపడ్డాడు. 2017లో గొలుసు దొంగతనాలు, ఇళ్లలో చోరీలకు పాల్పడిన అతడిపై ప్రొద్దుటూరు పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో దొంగతనాలు చేస్తే పోలీసులకు దొరికిపోతున్నామని గ్రహించి, అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేయాలని ప్లాన్ వేశాడు. ఇలా, 2020 నుంచి ప్రసన్నకుమార్‌ ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అమ్మాయిలు, మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. అమ్మాయిలు, మహిళలకు మాయమాటలు చెప్పి వారిని మభ్యపెట్టి, వారి అర్ధనగ్న ఫొటోలను సేవ్‌ చేసుకుని బెదిరింపులకు గురి చేస్తుండేవాడు. ఫోటోలను నీట్‌గా ఎడిట్ చేసి, మార్ఫ్ చేసి.. వాటికి మాయమాటలు జోడించేవాడు. ఆ మాటలను.. ఫోన్‌కాల్స్‌ దాకా, ఆడియో కాల్స్ నుంచి వీడియోకాల్స్ దాకా తీసుకొచ్చేవాడు. న్యూడ్ కాల్స్‌ దాకా వెళ్లేవాడు. ఆ తర్వాత వాటిని రికార్డ్ చేసి.. బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టేవాడు. వారి నుంచి పలు దఫాలుగా డబ్బులు, బంగారు నగలు వసూలు చేశాడు. అంతేకాకుండా వారిని శారీరకంగా లోబర్చుకుని అఘాయిత్యాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కానీ, చాలా మంది మహిళలు బయటకు తెలిస్తే పరువు పోతుందని ఈ విషయం ఎవరికీ చెప్పలేదని పోలీసులు పేర్కొన్నారు.

ఎట్టకేలకు కడపకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి సంబంధించి మోసానికి గురై, తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతడిని చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసన్న కుమార్ ఇప్పటి వరకు దాదాపు 200 మంది అమ్మాయి, 100 మంది మహిళలను మోసం చేసినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడు ప్రసన్న కుమార్‌ వద్ద నుంచి రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ సునీల్ తెలిపారు.

అయితే ఈ కంత్రీగాడి ఆటలు ఎక్కువ రోజులు సాగలేదు. దిశ యాప్ ద్వారా అమ్మాయి పిర్యాదు చేయడంతో అతగాడి అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేటుగాడి వ్యవహారంపై కడప డిఎస్పీ సునీల్ టీవీ9 తో మాట్లాడారు.. ప్రసన్న కుమార్ పై దిశ యాప్ ద్వారా పిర్యాదు రావడంతో ప్రత్యేక బృందంతో నిఘా పెట్టి.. అతనిని అరెస్ట్ చెశామని తెలిపారు. అతనిని విచారించగా అసలు నిజాలు బయటికి వచ్చాయని అన్నారు. 200 మంది అమ్మాయిలు మహిళలను ఇలాగే ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇలాంటి వారి పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవాలని డీఎస్పీ తెలిపారు..

Read Also…  KCR Sagar Tour: మరికాసేపట్లో నాగార్జున సాగర్‌కు సీఎం కేసీఆర్‌.. హామీల అమలు, పనుల పురోగతి, సమస్యలపై సమీక్ష

Click on your DTH Provider to Add TV9 Telugu