AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident in Chittoor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్నేహితులు బలి.. చనిపోయారా?.. చంపేశారా?

Accident in Chittoor: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో

Accident in Chittoor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్నేహితులు బలి.. చనిపోయారా?.. చంపేశారా?
Death
Shiva Prajapati
|

Updated on: Aug 02, 2021 | 9:21 AM

Share

Accident in Chittoor: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలంలోని ఆగరాల వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అగరాలకు చెందిన మణి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఆదివారం నాడు ఉదయం తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం, రాత్రి చంద్రగిరి మండలం అగరాల వద్ద జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు ప్రమాదాల వెనుక కుట్ర దాగి ఉందని స్థానికుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఆదివారం ఉదయం తిరుపతి-చిత్తూరు హైవేపై బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో.. బైక్‌పై వెళ్తున్న వరుణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న యువతికి కూడా గాయాలు అయ్యాయి. గాయపడిన యువతి.. మృతిచెందిన వరుణ్‌ పిన్ని కూతురు. ఇక నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మణి.. వరుణ్‌కు ప్రాణ స్నేహితుడు. వరుణ్‌ది ఆక్సిడెంట్ కాదని, మర్డర్ అని ఆ గ్రామంలో చాలా మందికి మణి చెప్పాడు. అలా చెప్పిన రాత్రే మణి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోలపోయాడు. అయితే, ఈ రెండు ప్రమాదాలకు ముందు రెండు రోజుల క్రితమే ఆగరాల గ్రామంలో వరుణ్ కుటుంబానికి, మరో వర్గంతో గొడవ జరిగింది. ఈ గొడవపై వరుణ్ కుటుంబ సభ్యులు చంద్రగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణల నేపథ్యంలో ఆదివారం ఉదయం వరుణ్.. సాయంత్రం మణి ప్రాణాలు కోల్పోవడం స్థానికులలో అనేక అనుమానాలు రేకెత్తి్స్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Tokyo Olympics 2020: ఒలింపిక్స్ కోసం వీటిని వదిలేసిన సింధు.. వాటితోనే ట్రీట్‌కు రెడీ అయిన ప్రధాని మోడీ..!

Poorna: నయనతార నాకు స్పూర్తి.. ఆమెలా చేయాలని ఉంది.. పూర్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…