AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో మహిళలపై అత్యాచారాలు, ఐరాస ఖండన, తిప్పికొట్టిన భారత్

ఇండియాలో ఇటీవల  మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసపై ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కో-ఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. మీ వ్యాఖ్యలు అనుచితమైనవని, అసమంజసం, అనవసరమైనవవి తప్పు పట్టింది.

ఇండియాలో మహిళలపై అత్యాచారాలు, ఐరాస ఖండన, తిప్పికొట్టిన భారత్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Oct 06, 2020 | 1:49 PM

ఇండియాలో ఇటీవల  మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసపై ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కో-ఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. మీ వ్యాఖ్యలు అనుచితమైనవని, అసమంజసం, అనవసరమైనవవి తప్పు పట్టింది. ముఖ్యంగా హత్రాస్ ఘటనను ప్రస్తావించిన ఐరాస కో-ఆర్డినేటర్.. ఈ విధమైన కేసులు ఈ దేశంలో పెరిగిపోతున్నాయని విమర్శించడం సరికాదని, ఈ కేసులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నదని, దర్యాప్తు దశలో ఉన్న కేసులపై ఈ విధమైన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయని విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అన్నారు. బయటి ఏజెన్సీ ఒకటి ఇలాంటి విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కాగా-హత్రాస్, బలరాంపూర్ ఘటనలను ఆ కో-ఆర్డినేటర్ ప్రస్తావించారు. ప్రభుత్వం వీటిపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పరోక్షంగా వ్వ్యాఖ్యానించారు.