Hyderbad Police: మీరు కూడా ఈ పాస్‌వర్డే పెట్టుకున్నారా? అయితే మీ పని గోవిందా.. కుర్‌కురేతో గదికి తాళం వేసినట్లే..
Hyderbad Police: సమాజంలో రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంంచంలో ఏదో మూలన కూర్చొని మన అకౌంట్లోని డబ్బును కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలోనే యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లను..
Hyderbad Police: సమాజంలో రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంంచంలో ఏదో మూలన కూర్చొని మన అకౌంట్లోని డబ్బును కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలోనే యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు చేతి వాటం ప్రదర్శిస్తే.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం మన నిర్లక్ష్యమే వారికి అవకాశంలా మారుతుంది. ముఖ్యంగా పాస్‌వర్డ్‌ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఇదే విషయాన్ని వినూత్న రీతిలో చెప్పారు హైదరాబాద్ పోలీసులు. సమాజంలో జరుగుతోన్న అంశాలను తమదైన శైలిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించే హైదరాబాద్ పోలీసులు తాజాగా పాస్‌వర్డ్, యూజర్ నేమ్ ఎంపికల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇందుకోసం ట్విట్టర్ వేదికగా ఓ వినూత్న ఫొటోను పోస్ట్ చేశారు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ స్థానాల్లో `అడ్మిన్` అని ఒకే పదం ఇచ్చిన స్క్రీన్ షార్ట్‌ను షేర్ చేశారు. ఇలాంటి పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడమంటే.. కురు కురేతో గదికి తాళం వేసినట్లే అని అర్థం వచ్చేలా ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అంటే.. పేరుకు లాక్ వేసినట్లే ఉంటుంది కానీ.. దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనేది సదరు ట్వీట్ లక్ష్యం. మీ పాస్‌వర్డ్ ఎంత వరకు సేఫ్‌గా ఉందో ప్రశ్నించుకోండంటూ హైదరబాద్ పోలీసులు ట్వీట్ చేశారు.
హైదరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్..
How Secure Is My Password ?? #cybersafety #cybercrime #cybersecurity pic.twitter.com/L8AY5WMSEn
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) June 10, 2021
Also Read: సొంత గొంతునే నమ్ముకుంటున్న మలయాళ హీరో.. పుష్పలో ఓన్ డబ్బింగ్ చెప్పుకోనున్న ఫాహద్ ఫాజిల్