యూనివర్శిటీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. విద్యార్ధినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్.. పోలీసుల ప్రకటన చూస్తే..!
యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ యువతిని కిడ్నాప్ చేసి.. అనంతరం గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సైయానా ప్రాంతంలోని యూనివర్శిటీ విద్యార్ధినిపై ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనపై చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. కాగా.. విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు ప్రకటించడంతో.. విద్యార్ధులు నిరసనలకు దిగారు. పోలీసు స్టేషన్ ముందు కూడా విద్యార్ధులు ఆందోళన […]
యూపీలోని బులంద్‌షహర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ యువతిని కిడ్నాప్ చేసి.. అనంతరం గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సైయానా ప్రాంతంలోని యూనివర్శిటీ విద్యార్ధినిపై ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనపై చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు.
కాగా.. విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్ జరగలేదని పోలీసులు ప్రకటించడంతో.. విద్యార్ధులు నిరసనలకు దిగారు. పోలీసు స్టేషన్ ముందు కూడా విద్యార్ధులు ఆందోళన చేపట్టారరు. హపూర్ జిల్లాలోని గఢ్ ముకటేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని గురువారం కాలేజీ నుంచి తిరిగి ఇంటికి వెళ్తోన్న సమయంలో.. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది. అనంతరం సదరు బాధిత యువతిని మీరట్ మెడికల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పోలీసుల వర్షన్ మరోలా ఉండటంతో.. విద్యార్ధులు మండిపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ.. వన్స్ మోర్ హైదరాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. వెంటనే దుండగులను పట్టుకుని చంపేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం మాత్రం.. అమ్మాయిపై ఎలాంటి గ్యాంగ్ రేప్ జరగలేదని.. ఇంటికి వెళ్తున్న సమయంలో తన సహచర విద్యార్ధితో బైక్‌పై వెళ్తుండగా కింద పడిందని.. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే అప్పుడు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అటు మెడికల్ రిపోర్టులో కూడా యువతిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కాలేదని పోలీసులు ప్రకటించారు.