హైదరాబాద్‌కు అలర్ట్: ఓ వైపు కరోనా..మరో వైపు డ్రగ్స్ మాఫియా బుసలు

గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఓ వైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుండగా.. మరోవైపు డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా బుసలు కొడుతోంది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ మాఫియా విజృంభిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గతంలో డ్రగ్స్ వాడిన 300 మంది..

హైదరాబాద్‌కు అలర్ట్: ఓ వైపు కరోనా..మరో వైపు డ్రగ్స్ మాఫియా బుసలు
Follow us

|

Updated on: Jun 04, 2020 | 3:17 PM

గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఓ వైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుండగా.. మరోవైపు డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా బుసలు కొడుతోంది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ మాఫియా విజృంభిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గతంలో డ్రగ్స్ వాడిన 300 మందిపై నిఘా అధికారులు..నిఘా ఉంచారు. కొంతమంది ప్రముఖులు బెంగళూరు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అలాగే గతంలో డ్రగ్స్ విక్రయాలు నిర్వహించిన వారి కదలికలపై కూడా అధికారులు నిఘా ఉంచారు.

తాజాగా అమిత్, పరమ్ అనే వారి దగ్గరి నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. గత 15 రోజులుగా డ్రగ్స్ వినియోగం పెరిగినట్లు తెలుస్తుండగా.. డ్రగ్స్ మాఫియాలోని ప్రముఖులు, వ్యాపార వేత్తలు, విద్యార్థులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారి జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అమిత్, పరమలిద్దరూ వాట్సాప్ చాటింగ్‌తో పాటు కాల్‌డాటాను డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాట్సాప్ చాటింగ్‌ను రీట్రైవ్ చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పోలీస్ అధికారుల సాయాన్ని తీసుకుంటున్నారు. వాట్సాప్ చాటింగ్ బయటకు వస్తే మరికొంతమంది ప్రముఖుల బండారం బయటపడే అవకాశం ఉందంటున్నారు అధికారులు.