Saidabad case: ఒక్కడు.. 3 వేల మంది పోలీసులు.. వేలాది కెమెరాలు.. 6 రోజులు. ఎక్కడికి వెళ్లాడు.. ఎందుకు దొరకలేదు?

సైదాబాద్ చిన్నారి హత్య ఘటనలో అనేక ప్రశ్నలు ఇప్పుడు సమాజాన్ని వెంటాడుతున్నాయి. మృగాడి రక్కసి కోరల్లో.. ఆరేళ్ల పసిపాప అశువులు బాసింది

Saidabad case: ఒక్కడు.. 3 వేల మంది పోలీసులు.. వేలాది కెమెరాలు.. 6 రోజులు. ఎక్కడికి వెళ్లాడు.. ఎందుకు దొరకలేదు?
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 15, 2021 | 9:37 PM

Raju Search Operation: సైదాబాద్ చిన్నారి హత్య ఘటనలో అనేక ప్రశ్నలు ఇప్పుడు సమాజాన్ని వెంటాడుతున్నాయి. మృగాడి రక్కసి కోరల్లో.. ఆరేళ్ల పసిపాప అశువులు బాసింది. చిన్నారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. న్యాయం కోసం సమాజం డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో ఇంతవరకూ నిందితుడిని పట్టుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, నిందితుడు రాజు కోసం ముమ్మర వేట సాగుతోంది. 3వేల మంది పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో వెయ్యి సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను విశ్లేషించారు. వాటి ఆధారంగా కిరాతకుడు రాజు ఉప్పల్‌ వెళ్లినట్టు గుర్తించారు. ఓ వైన్‌షాప్‌ దగ్గర అతను పడేసిన కవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో కల్లు సీసా, టవల్ ఉన్నాయి.

మరోవైపు.. వైన్‌షాపుల దగ్గర మఫ్టీలో పోలీసులు మోహరించారు. ఆ రూట్‌లో ఎటు వెళ్లినా పట్టేసేందుకు రెడీగా ఉన్నారు. ఎనీటైం నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. నిందితుడి ఫొటోను బార్లు, వైన్‌షాప్‌ల దగ్గర పెట్టాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి తేవాలన్నారు. సైదాబాద్ ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. హత్యాచార ఘటనపై సీఎం చాలా సీరియస్‌గా ఉన్నారనీ.. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకోవాలని ఆదేశించారు. చట్టపరంగా శిక్ష పడేలా చూడాలన్నారు హోం మంత్రి అలీ. అటు.. డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

టౌన్‌ నుంచి మారుమూల పోలీస్‌స్టేషన్ల వరకు అన్నిచోట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఏ చిన్న సమాచారాన్ని వదలిపెట్టొద్దని ఆదేశించారాయన. ముఖ్యంగా వైన్‌షాపులు, కల్లు కాంపౌండ్‌ల దగ్గర నిఘా పెంచాలని సూచించారు. రాజు ఫోటోలతో స్థానికంగా గాలింపు చేపట్టాలని ఆదేశించారు డీజీపీ మహేందర్‌ రెడ్డి. మరోవైపు, సైదాబాద్‌ కేసులో.. బాధిత కుటుంబాన్ని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. నిందితుడిని త్వరగా పట్టుకుని శిక్షించడమే కాకుండా.. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఆమె నిరాహార దీక్షకు దిగారు. శిబిరంలో విజయమ్మ కూడా కూర్చున్నారు.

Read also: CM Jagan: బాబు వల్లే A గ్రేడ్‌లో ఉన్న ఏపీలోని మహిళా సంఘాలన్నీ C గ్రేడ్‌లోకి పడిపోయాయి: సీఎం వైయస్ జగన్

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..