CM Jagan: బాబు వల్లే A గ్రేడ్‌లో ఉన్న ఏపీలోని మహిళా సంఘాలన్నీ C గ్రేడ్‌లోకి పడిపోయాయి: సీఎం వైయస్ జగన్

డ్వాక్రా రుణాల విషయంలో TDP సర్కారు మోసం చేసిందన్నారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే A గ్రేడ్‌లో ఉన్న మహిళా సంఘాలన్నీ

CM Jagan: బాబు వల్లే A గ్రేడ్‌లో ఉన్న ఏపీలోని మహిళా సంఘాలన్నీ C గ్రేడ్‌లోకి పడిపోయాయి:  సీఎం వైయస్ జగన్
Cm Jagan
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 15, 2021 | 8:53 PM

Dwakra mahila loans – AP: డ్వాక్రా రుణాల విషయంలో TDP సర్కారు మోసం చేసిందన్నారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే A గ్రేడ్‌లో ఉన్న మహిళా సంఘాలన్నీ C గ్రేడ్‌లోకి పడిపోయాయని ఆయన ఆరోపించారు. మహిళల సుస్థిర ఆర్థిక ప్రగతికోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో చేయూత, ఆసరా పథకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. మహిళల్లో సుస్థిర ఆర్థిక ప్రగతికోసం చేపడుతున్న ఉపాధిమార్గాలు, వాటి అమలు కార్యక్రమాలపై చర్చించారు.

ఆసరా కార్యక్రమం వివరాలను జగన్‌కు ఈ సందర్భంగా అందించారు అధికారులు. తొలి విడతలో దాదాపు 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు లబ్ధి చేకూరినట్లు చెప్పారు. 6,330 కోట్ల రూపాయల్ని సంఘాలకు అందించినట్లు వెల్లడించారు. రెండో విడత ఆసరా సన్నాహకాలను సీఎంకు వివరించారు అధికారులు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు సీఎం జగన్. కనీసం వడ్డీలు కూడా చెల్లించకపోవడంతో మొత్తం వ్యవస్థే చిన్నాభిన్నం అయిందని అన్నారు. ఆ రుణాలను ఇప్పుడు ప్రభుత్వమే నాలుగు దఫాలుగా చెల్లిస్తోందని చెప్పారు సీఎం జగన్.

అంతేకాదు, 2016లో రద్దైపోయిన సున్నావడ్డీ రుణాలను మళ్లీ తీసుకొచ్చి.. మహిళలను ఆదుకున్నామని తెలిపారు. ఐటీసీ, రిలయన్స్, అమూల్‌ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించామన్నారు. చంద్రబాబు వల్లే A గ్రేడ్‌లో ఉన్న మహిళా సంఘాలన్నీ C గ్రేడ్‌లోకి పడిపోయాయని ఆరోపించారు జగన్. పాదయాత్ర చేసినప్పుడు ప్రతి మహిళా… డ్వాక్రారుణాలు మాఫీ చేయాలని కోరిన సంగతి గుర్తు చేశారు. అందుకే ఆసరా, చేయూతలను తీసుకొచ్చినట్లు చెప్పారు.

మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధికోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి… మరింతమందికి లబ్ధి చేకూరుస్తామని చెప్పారు సీఎం జగన్ . రెండో విడత ఆసరా కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులను కూడా ఇందులో పాల్గొనేలా చూడాలన్నారు.

Read also: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.. కేంద్ర మంత్రులకు చిన్నజీయర్ స్వామి ఆహ్వానం..

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..