TDP: జిల్లాలో పార్టీని కాపాడండి.. త్వరగా జోక్యం చేసుకోండి.! అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తులు

గుంటూరు జిల్లాలో పార్టీని కాపాడండి.! త్వరగా జోక్యం చేసుకోండి.! టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తి ఇది.!

TDP: జిల్లాలో పార్టీని కాపాడండి.. త్వరగా జోక్యం చేసుకోండి.! అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తులు
Chandrababu
Follow us

|

Updated on: Sep 15, 2021 | 8:26 PM

Guntur Politics – TDP – Chandrababu: గుంటూరు జిల్లాలో పార్టీని కాపాడండి.! త్వరగా జోక్యం చేసుకోండి.! టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తి ఇది.! రేపు కండ్లకుంటలో కోడల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సమయంలో జిల్లా నేతల నుంచి ఇలాంటి ఫిర్యాదులు రావడం సంచలనంగా మారింది. ఇంతకీ పల్నాడు టీడీపీలో ఏం జరుగుతోంది?

కొంతకాలంగా పల్నాడు పాలిటిక్స్ రంజుగా మారాయి. టీడీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రెండో వర్ధంతి సందర్భంగా స్వగ్రామం నకరికల్లు మండలం కండ్లకుంటలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం కాస్తా ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. కోడెల శివప్రసాద్‌ కొడుకు కోడెల శివరాంపై పార్టీ నేతలే సంచలన ఆరోపణలు చేశారు. తన దగ్గర నుంచి శివరాం 32 లక్షలు తీసుకున్నారని టీడీపీ నేత పమిడి బాలకృష్ణ మండిపడ్డారు. ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.

కోడల శివప్రసాద్ మరణం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు శివరాం. ఇటీవలే సత్తెనపల్లిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లికి ఇంతవరకు ఇంఛార్జ్‌ను నియమించలేదు. దీంతో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోడెల రెండో వర్ధంతి నాటికి స్వగ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు, కమిటీ భావించింది. గురువారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. అయితే కండ్లకుంటకే చెందిన మాజీ సర్పంచ్ రామయ్య, అతని తనయుడు బాలకృష్ణ కోడెల శివరాంపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

కోడెల శివరాం వల్లే జిల్లాలో టీడీపీ భ్రష్టుపట్టిపోయిందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను దూరంగా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోలు, పోస్టింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ ఫిర్యాదులపై హైకమాండ్ ఏలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read also: విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.. కేంద్ర మంత్రులకు చిన్నజీయర్ స్వామి, మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డా. జూపల్లి రామేశ్వర్‌రావు ఆహ్వానం