Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. కిడ్నాప్‌ చేసి క్రూరంగా చంపారు.. ఆ తర్వాత శవాలను..

Couple Murder: ప్రేమలో పడి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. కుటుంబసభ్యులు క్రూరమృగాల్లా మారారు. వారిద్దరినీ పట్టుకొని.. అతి దారుణంగా హతమార్చారు. అనంతరం ఎవరికి

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. కిడ్నాప్‌ చేసి క్రూరంగా చంపారు.. ఆ తర్వాత శవాలను..
Crime News
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Sep 18, 2021 | 8:51 AM

Couple Murder: ప్రేమలో పడి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. కుటుంబసభ్యులు క్రూరమృగాల్లా మారారు. వారిద్దరినీ పట్టుకొని.. అతి దారుణంగా హతమార్చారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాలను రెండు రాష్ట్రాల్లో వదిలేసి వేళ్లారు. రాజస్థాన్‌లో లభ్యమైన ఓ యువతి మృతదేహంపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌ ప్రాంతం జహంగీర్‌పుర్‌లో ఓ యువకుడు, బాలిక కొంతకాలం నుంచి ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పడంతో.. వారు పెళ్లి వద్దంటూ బాలికను గద్దించారు. దీంతో ప్రేమికులిద్దరూ జులై 31 ఢిల్లీకి పారిపోయి అక్కడే ఉంటున్నారు.

అయితే.. ప్రేమికులు ఢిల్లీలో ఉన్నారన్న సమాచారంతో బాలిక కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. వారిని జీపులో ఎక్కించుకొని మధ్యప్రదేశ్‌లోని భిండ్‌కు, అక్కడి నుంచి గ్వాలియర్‌కు తీసుకెళ్లారు. వెళ్లే దారిలోనే యువకుడిని అత్యంత దారుణంగా హతమార్చారు. అతడి మర్మాంగాలను, శరీర భాగాలను కత్తితో కోసి.. మృతదేహాన్ని అత్రి పోలీసుస్టేషన్‌ పరిధిలో పడేసి వెళ్లిపోయారు. అయితే.. ఆగస్టు 5న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలోనే.. రాజస్థాన్‌లోని ధోల్‌పురా ప్రాంతంలో ఓ బాలిక శవాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెకు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అనుమానంతో బాలిక కుటుంబసభ్యుల ఫోన్‌ లొకేషన్లను పరిశీలించారు. దీంతో వారు వారు ఢిల్లీ, గ్వాలియర్‌, ధోల్‌పుర్‌ ప్రాంతాల్లో పర్యటించినట్లు గుర్తించారు. అనంతరం విచారణ చేపట్టగా.. ఈ జంట హత్యలను తామే చేసినట్లు ఒప్పుకున్నారు. బాలిక కుటుంబసభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

DGP Mahender Reddy: అసలు ఆ అనుమానాలే అక్కర్లేదు.. రేపిస్ట్ రాజు మృతిపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

పెళైన యువతి ఫొటో మార్ఫింగ్‌ చేసిన విద్యార్థి.. వాట్సాప్‌లో కుటుంబసభ్యులకు షేర్.. ఆతర్వాత ఏంజరిగిందంటే..?

కశ్మీర్ నరకంగా మారుతుంది.. సల్మాన్ ఖాన్..
కశ్మీర్ నరకంగా మారుతుంది.. సల్మాన్ ఖాన్..
జున్ను తింటున్నారా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
జున్ను తింటున్నారా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు
చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన అస్సాం ప్రొఫెసర్..!
చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన అస్సాం ప్రొఫెసర్..!
మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
మొక్కే కదా అనుకోకండి..! 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
ప్రేమ కోసం సినిమాలు వదిలేసిన హీరోయిన్.. చివరకు భర్త చేతిలో..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...