నైజీరియన్ చేతిలో మోసపోయిన హీరోయిన్!

సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎన్నిసార్లు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. ప్రజలు ఏదో రకంగా మోసపోతూనే ఉన్నారు. ఇక ఈ లిస్ట్‌లో సినీ సెలెబ్రిటీలు కూడా ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే తాజాగా ఓ సినీ హీరోయిన్ ఇలాంటి సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ సోనాక్షి వర్మకు కొన్ని నెలల క్రితం మెర్రిన్ కిర్రాక్ అనే నైజీరియన్ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ […]

నైజీరియన్ చేతిలో మోసపోయిన హీరోయిన్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 12, 2019 | 7:01 PM

సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎన్నిసార్లు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. ప్రజలు ఏదో రకంగా మోసపోతూనే ఉన్నారు. ఇక ఈ లిస్ట్‌లో సినీ సెలెబ్రిటీలు కూడా ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే తాజాగా ఓ సినీ హీరోయిన్ ఇలాంటి సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

అసలు వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ సోనాక్షి వర్మకు కొన్ని నెలల క్రితం మెర్రిన్ కిర్రాక్ అనే నైజీరియన్ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. అతని రిక్వెస్ట్‌ను సోనాక్షి యాక్సెప్ట్ చేసి.. అప్పుడప్పుడూ చాటింగ్ చేస్తుండేది. ఇక రీసెంట్‌గా మెర్రిన్ తమ స్నేహానికి గుర్తుగా ఓ బహుమతిని పంపుతానంటూ ఫోన్ చేశాడు. ఫోన్ వచ్చిన వారం రోజుల తర్వాత నైజీరియా నుంచి గిఫ్ట్ వచ్చిదంటూ.. ఆ గిఫ్ట్ కోసం 85 వేలు కట్టాలని ఓ వ్యక్తి సోనాక్షికి తెలియజేశాడు. నిజంగా తనకు ఎయిర్‌పోర్ట్ అధికారుల నుంచే ఫోన్ వచ్చిందనుకున్న సోనాక్షి వర్మ.. ఆ వ్యక్తి అకౌంట్‌లోకి 85 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే వారం రోజులైనా గిఫ్ట్ ఇంటికి చేరకపోవడం.. తనకు ఫోన్ చేసిన నెంబర్ స్విచ్ ఆఫ్ కావడంతో.. తాను మోసపోయానని గ్రహించి, హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది హీరోయిన్ సోనాక్షి వర్మ. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.