Hero NTR : రోడ్డు ప్రమాదంలో నా అన్న, తండ్రిని కోల్పోయాను.. ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి స్టార్ హీరో..

NTR: సైబరాబాద్ ‌ పోలీస్ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం కొన‌సాగుతోన్న జాతీయ రహదారి భద్రత మాసంలో

Hero NTR : రోడ్డు ప్రమాదంలో నా అన్న, తండ్రిని కోల్పోయాను.. ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి స్టార్ హీరో..
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2021 | 2:31 PM

NTR: సైబరాబాద్ ‌ పోలీస్ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం కొన‌సాగుతోన్న జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ సీపీ స‌జ్జ‌నార్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం కూడా జ‌రుపుతున్నారు. దీనికి అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదాల గురించి యువతకు అవగాహన కల్పించారు.

ఈ రోజు ఈ కార్యక్రమంలో తాను నటుడిగా రాలేదని, ఓ బాధితుడిగా వచ్చానని అన్నారు. రోడ్డు ప్రమాదంలో తన కుటుంబంలో అన్నను, తండ్రి హరికృష్ణని కోల్పోయాని ఆవేదన వ్యక్తం చేశారు. 33 వేల కిలోమీటర్లు మా తాత గారు పర్యటన చేస్తే ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మా నాన్న గారు తీసుకెళ్లారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి అర్ధనంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కనుక ఇంటి నుంచి బయటికి వెళ్లే టప్పుడు మన కోసం ఎదురుచూసే ఇంట్లో వాళ్ళని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యంత ప్రమాదకరమైన కోవిడ్‌కి వ్యాక్సిన్ ఉంది కానీ, ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు వ్యాక్సిన్ లేదని అన్నారు.మీ కోసం మీ కుటుంబం కోసం బాధ్యతయుతంగా ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. మన దేశాన్ని పహారా కాస్తున్న సైనికులను , మన ఇంటి పక్కనే పహారా కాస్తున్న పోలుసుల సేవలను అందరూ గుర్తించాలని కోరారు. మన తల్లిదండ్రులను ఏవిధంగా అయితే గౌరవిస్తామో అలాగే మన పోలీస్ డిపార్ట్ మెంట్‌ను కూడా ఓ పౌరుడిగా గౌరవించాలన్నారు.