ఏజెన్సీ హడల్.. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని..

విజయనగరం ఏజెన్సీ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఓ వైపు మావోయిస్టు బంద్‌లు, పోలీసుల కూంబింగ్..మరో వైపు... ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొమరాడ మండలంలో గజరాజులు ఘీంకారం చేస్తూ...పరుగులంకిస్తున్నాయి..

ఏజెన్సీ హడల్.. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని..
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 29, 2020 | 5:59 PM

విజయనగరం ఏజెన్సీలో ఏనుగుల గుంపు రెచ్చిపోతోంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొమరాడ మండలం విక్రంపురం-ఆర్తాం రిజర్వ్ ఫారెస్టులో ఏనుగులు తిష్టవేశాయి. గత వారం రోజులుగా ఈ ఏనుగులు జనావాసాల్లో తిరుగుతుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఏనుగుల గుంపు ఏజెన్సీ మండలాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వారం రోజులుగా కొమరాడ మండలంలో అనేక చోట్ల పంట పొలాలతో పాటు విలువైన ఆస్తులు ధ్వంసం చేస్తున్నాయి.

సోమవారం రోజున జనవాసాల్లోకి వచ్చిన ఏనుగుల గుంపు వాటర్ ప్లాంట్ గోడను ధ్వంసం చేయగా.. మంగళవారం మరోమారు గ్రామంలో బీభత్సం స‌ృష్టించాయి. కల్లికోట, బుగ్గి సమీపంలోని ట్రాక్టర్‌ను ధ్వంసం చేశాయి. భారీగా ఘీంకారాలు చేస్తున్న ఏనుగులు పరుగు లంకిస్తూ రైతుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏనుగుల స్వైర విహారంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణానికి ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.