ముంబయిలో మరో నటుడు ఆత్మహత్య కలకలం
ముంబయ్‌లో మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వ్యవహారం వీడని మిస్టరీగా రోజుకో కొత్త మలుపులు తిరుగుతూ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ముంబయ్‌లో మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వ్యవహారం వీడని మిస్టరీగా రోజుకో కొత్త మలుపులు తిరుగుతూ..అనేక ప్రశ్నలకు తెరలేపుతూ..బాలీవుడ్, టాలీవుడ్‌లను షేక్ చేస్తూ..సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో టీవీ నటుడు ముంబయిలోని తన ఫ్లాట్‌లోనే సూసైడ్ చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
బీహార్ కు చెందిన అక్షత్ ఉత్కర్ష్ (26) అనే టీవీ నటుడు ముంబయిలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ముంబయిలోని అంబోలీ ప్రాంతంలో ఉత్కర్ష్ గాళ్ ఫ్రెండ్ తో కలిసి ఫ్లాట్ లో ఉంటున్నాడు. అయితే, ఆమె ఆదివారం రాత్రి ఉత్కర్ష్ విగతజీవుడిలా ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో టీవీ షూటింగ్ లు నిలిచిపోవడంతో ఉత్కర్ష్ మానసికంగా కుంగిపోయాడని, ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఉత్కర్ష్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడ్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.